More

    వైఎస్ విజయలక్ష్మికి తప్పిన ప్రమాదం

    ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మికి పెను ప్రమాదం తప్పింది. ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి ఆమె కర్నూలుకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా గుత్తి దగ్గర కారు టైర్లు పేలడంతో ఒక్కసారిగా అక్కడ టెన్షన్ నెలకొంది. ఈ ప్రమాదం నుంచి విజయమ్మ సురక్షితంగా బయటపడ్డారు. ఆ తర్వాత ఆమె వేరే కారులో వెళ్లిపోయారు. అనంతపురంలో జరిగిన ఓ పెళ్లికి హాజరయ్యారు విజయలక్ష్మి. ఆ తర్వాత కర్నూలుకు వెళ్లారు. అక్కడ కాసేపు ఉండి తిరుగుపయనం అయ్యారు. గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. అయితే కారు అదుపుతప్పకుండా డ్రైవర్ చూసుకున్నాడు. ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు.

    spot_img

    Trending Stories

    Related Stories