More

    నేడు నెల్లూరులో ఏపీ సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు నెల్లూరులో పర్యటించనున్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నేలటూరు జెన్‌కో థర్మల్‌ కేంద్రం మూడో యూనిట్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. థర్మల్‌ కేంద్రంలో పైలాన్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో జెన్‌కో బైపాస్‌ పక్కనే ముసునూరువారిపాలెం కూడలిలో సీఎం సభను ఏర్పాటు చేశారు. థర్మల్‌ కేంద్రం నుంచి సభా ప్రాంగణం వరకు రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

    నేలటూరులో ఏపీజెన్‌కో ప్రాజెక్ట్‌ మూడో యూనిట్‌ (800 మెగావాట్లు)ను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. నెల్లూరు టూర్ లో భాగంగా ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 10.55 గంటలకు కృష్ణపట్నం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు. అనంతరం 11.10 – మధ్యాహ్నం 1.10 గంటల మధ్య నేలటూరులో ఏపీజెన్‌కో ప్రాజెక్ట్‌ మూడో యూనిట్‌ (800 మెగావాట్లు) ప్రాజెక్టు జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. జెన్ కో ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన తర్వాత అక్కడే ఏర్పాటు చేసే బహిరంగసభలోనూ ముఖ్యమంత్రి జగన్ పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

    Trending Stories

    Related Stories