More

    వ‌ర‌ద బాధితుల‌తో నేరుగా మాట్లాడ‌నున్న సీఎం వైఎస్ జ‌గ‌న్

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాలకు వెళ్లనున్నారు. కోన‌సీమ జిల్లా మీదుగా ప్రారంభం కానున్న మంగ‌ళ‌వారం నాటి పర్య‌ట‌న‌కు సంబంధించిన టూర్ షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుద‌ల చేసింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో సీఎం జ‌గ‌న్ వ‌ర‌ద బాధితుల‌తో నేరుగా మాట్లాడ‌నున్నారు.

    టూర్ వివరాలు:

    మంగ‌ళ‌వారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు కోన‌సీమ జిల్లాలోని పి.గ‌న్న‌వ‌రం మండ‌లం పెద‌పూడికి జ‌గ‌న్ చేరుకుంటారు.
    ఆ తర్వాత స‌మీపంలోని పుచ్చ‌కా‌య‌లవారిపేట‌లో వ‌ర‌ద బాధితుల‌తో జ‌గ‌న్ భేటీ అవుతారు.
    ఆ తర్వాత అలిగేవారిపేటకు చెందిన వ‌ర‌ద బాధితుల‌తో సీఎం మాట్లాడ‌నున్నారు.
    ఆ త‌ర్వాత ఊడిమూడిలంక‌లో వ‌ర‌ద బాధితుల‌తో జ‌గ‌న్ స‌మావేశం అవుతారు.
    వాడ్రేవుప‌ల్లికి మ‌ధ్యాహ్నం 2.05 గంట‌ల‌కు జ‌గ‌న్ చేరుకుంటారు.
    అక్క‌డి నుంచి రాజోలు మండ‌లం మేక‌ల‌పాలెం వెళ‌తారు.
    ఆ త‌ర్వాత సాయంత్రం 4.05 గంట‌ల‌కు రాజ‌మ‌హేంద్ర‌వ‌రం చేరుకుంటారు.
    రాజ‌మ‌హేంద్రవ‌రం గెస్ట్ హౌస్‌లో వ‌ర‌ద‌ల‌పై అధికారుల‌తో స‌మీక్షిస్తారు.
    మంగ‌ళ‌వారం రాత్రి జ‌గ‌న్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోనే బ‌స చేస్తారు.
    బుధవారం కూడా జ‌గ‌న్ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు.

    spot_img

    Trending Stories

    Related Stories