ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవ్వనున్నారు. ఆదివారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరుతారు. ఈ రాత్రి ఢిల్లీలో బస చేస్తారు. సోమవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. కొద్ది రోజుల క్రితమే నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిశారు. ఇప్పుడు మరోసారి ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
షెడ్యూల్:
సాయంత్రం 6.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు ఏపీ సీఎం. 7 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ పయనం, రాత్రి 9.15 గంటలకు ఢిల్లీ చేరుకుని రాత్రికి 1 జన్పథ్ నివాసంలో బస చేయనున్నారు.
మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ సీఎం జగన్ చర్చించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్… నూతన రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన ధన్ ఖడ్ తోనూ సమావేశం కానున్నారు.