More

    విశాఖపట్నంకు సీఎం జగన్.. షెడ్యూల్ ఖరారు

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి విశాఖ పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పలు అభివృద్ది, శంకుస్ధాపన కార్యక్రమాల్లో సీఎం జగన్‌ పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు షెడ్యూల్ విడుద‌ల చేశారు. 11వ తేదీ సాయంత్రం 5.05 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జ‌గ‌న్‌ బయలుదేరుతారు. 6.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. 6.35 గంటలకు ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుని ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం రాత్రికి పోర్ట్‌ గెస్ట్‌హౌస్‌లో బసచేస్తారు. 12వ తేదీ ఉదయం 10.05 గంటలకు ఏయూ గ్రౌండ్‌లోని హెలీప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 10.20 గంటలకు ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలుకుతారు. 10.30 – 11.45 గంటల వరకు ప్రధానితో కలిసి పలు శంకుస్ధాపనలు, ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవాలలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుని ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. 12.45 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

    Trending Stories

    Related Stories