More

    కృష్ణకు నివాళులు అర్పించిన సీఎం జగన్.. కడచూపు కోసం పోటెత్తిన అభిమానులు

    సూపర్‌ స్టార్‌ కృష్ణ పార్థీవ దేహాన్ని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో పద్మాలయ స్టూడియోకి తరలివస్తున్నారు. ఈఉదయం నానక్ రామ్ గూడలోని ఆయన నివాసం నుంచి కృష్ణ పార్థీవ దేహాన్ని పద్మాల స్టూడియోకు తీసుకెళ్లారు. ఏపీ సీఎం జగన్ పద్మాలయ స్టూడియోకు వచ్చి కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అలాగే తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా నివాళులు అర్పించారు. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, కోట శ్రీనివాసరావు సహా పలువురు ప్రముఖులు కృష్ణ పార్థీవ దేహంపై పూలు చల్లి నివాళులు అర్పించారు. మరోవైపు తమ అభిమాన నటుడిని కడచూపు చూసి వీడ్కోలు పలికేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు.

    ఈ మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగనున్నాయి.కృష్ణ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. పద్మాలయ స్టూడియోస్ నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర సాగనుంది. మరోవైపు కృష్ణ మృతికి సంతాపంగా తెలుగు చిత్ర పరిశ్రమ షూటింగ్‌లు బంద్‌కి పిలుపునిచ్చింది. పలుచోట్ల సినిమా హాల్‌లను మూసివేశారు.

    Trending Stories

    Related Stories