International

ఆ నర్స్ కు వ్యాక్సినేషన్ అంటే ఇష్టం లేదు.. అందుకని ఏమి చేసిందంటే..?

కరోనా మహమ్మారిని అడ్డుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ, పలువురు నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే కొందరు నాయకులు వ్యాక్సినేషన్ కు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఇక వైద్య వృత్తిలో ఉన్న వాళ్లు కూడా వ్యాక్సినేషన్ కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించిన ఘటనలు ఇప్పటికే బయట పడ్డాయి.

జర్మనీకి చెందిన ఓ నర్సు చేసిన నిర్వాకానికి అధికారులు తలలు పట్టుకుంటూ ఉన్నారు. ఆమెకు వ్యాక్సినేషన్ ప్రోగ్రాం అన్నది అసలు నచ్చదట.. అందుకు గానూ వ్యాక్సిన్ బదులుగా సెలైన్ ద్రావణాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది. జర్మనీలోని ఫ్రైస్‌ల్యాండ్‌లో ఓ నర్సు.. మార్చి-ఏప్రిల్ మధ్యలో వ్యాక్సిన్ బదులుగా దాదాపు 8,600 మందికి సెలైన్ ద్రావణాన్ని ఇచ్చినట్టు తాజాగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో స్థానిక కౌన్సిలర్ స్వెన్ అంబ్రోసీ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ విషయం తెలిసిన వెంటనే షాక్‌కు గురయ్యామని.. టీకా స్థానంలో సెలైన్ ద్రావణాన్ని పొందిన 8,600 మందికి టీకా డోసులను ఇవ్వనున్నట్టు తెలిపారు. టీకా బదులుగా ప్రజలకు సెలైన్ ద్రావణాన్ని ఇచ్చిన నర్సు‌కు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు.

ఫేస్‌బుక్ పోస్ట్‌లో మార్చి 5 నుండి ఏప్రిల్ 20 మధ్య టీకాలు పొందిన వారు మరొక టీకా వేయించుకోవాలని అధికారులు తెలిపారు. ప్రస్తుత పోలీసు విచారణ ప్రకారం 5.3.2021 నుండి 20.4.2021 వరకు టీకాలు పొందిన వారికి ఆమె వ్యాక్సిన్ల డ్యూటీలో ఉందని.. వ్యాక్సిన్లు బదులుగా సెలైన్ ద్రావణం ఇచ్చిందని తెలిపారు. టీకాకు బదులుగా సెలైన్ ద్రావణాన్ని తీసుకున్న వారికి ఎటువంటి హాని కలిగించలేదని అన్నారు. నర్సు చర్యలు వేలాది మందిపై కరోనా వైరస్‌ ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు. జర్మన్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు పోలీసు ఇన్వెస్టిగేటర్ పీటర్ బీర్ సాక్షి వాంగ్మూలాల ఆధారంగా ఆమె సెలైన్ ను ఎక్కించినట్లు కనుక్కున్నారు. నిందితురాలైన నర్సు పేరును పోలీసులు వెల్లడించలేదు. సదరు నర్సును అరెస్టు చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twelve + seventeen =

Back to top button