More

  కోల్‎కతా వీధుల్లో మతోన్మాదుల వీరంగం..! మమతా మీకు కనిపిస్తుందా..?

  దేశంలో హిందువులు అధికశాతం మంది వున్నా అహంకారం వుండదు. మంచిని పెంచుతారు, పంచుతారు. పరమత సహనానికి పెద్ద పీట వేస్తారు. హిందూ పండుగలు ఘనంగా నిర్వహించుకుంటారు. అన్యమతస్థులను సాదరంగా ఆహ్వానిస్తారు. వారి పండుగలకు శుభాకాంక్షలు చెబుతారు. తమ దేవుళ్లను భక్తిశ్రద్ధలతో పూజించుకుంటారు. ముష్కర మూకల దృష్టిలో మాత్రం ఇలా చేయడం మహా నేరం. ఘోర పాపం. అకారణ కలహాలకు కాలు దువ్వి.. హిందువుల ఆస్తులు ధ్వంసం చేస్తారు. హిందూ బంధువులపై దాడి చేస్తారు. ఇలా దారుణ కృత్యాలకు పాల్పడడం ఇస్లామిస్టులకు నిత్యకృతయం అయ్యింది.

  పశ్చిమ బెంగాల్‌ కోల్‌కతా మోమిన్‌పూర్ ప్రాంతంలో ఇస్లాం ముష్కర మూకలు రెచ్చిపోయాయి. లక్ష్మీ పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడానికి సమాయత్తమైన హిందువులకు.. ముష్కర మూకలు రాక్షస మూకల్లా అడ్డుతగిలారు. మైలా డిపో ప్రాంతంలోని హిందువులకు చెందిన బైక్‌లు, దుకాణాలను ఇస్లామిస్టులు ధ్వంసం చేశారని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ తెలిపారు. ఆయన పంచుకున్న వీడియోలో, బైక్‌లు, సమీపంలోని దుకాణాలు దెబ్బతిన్న స్థితిలో కనిపించాయి.

  మోమిన్‌పూర్‌లో హిందూ వ్యతిరేక హింసాకాండ యధేచ్ఛగా సాగిందని, దీంతో హిందువులు భయభ్రాంతులకు గురయ్యారని బీజేపీ నేతలు తెలిపారు. ఇక్కడ కేంద్ర బలగాలను అత్యవసరంగా మోహరించాలని BJP నేతలు కోరారు. దీనిపై ట్విట్టర్ వినియోగదారు సయ్యద్ ఇష్తియాక్ ఆలం సైతం ట్వీట్ విడుదల చేశారు. ఎక్బల్‌పూర్ పోలీస్ స్టేషన్ లోపల నుంచి మైక్రోఫోన్ ద్వారా మాట్లాడుతున్న షాబాజ్ ఆలంను.. సయ్యద్ ఇష్తియాక్ ఆలం ప్రశ్నించారు. టీఎంసీ కౌన్సిలర్ అల్లుడు రెహాన్ ఖాన్, టీఎంసీ నాయకుడు ఫర్హాద్ హకీమ్ సన్నిహితుడు షాబాజ్ ఆలం,.. ఫీనిక్స్ గ్రూప్ యజమాని గులాం అస్రఫ్ ఆధ్వర్యంలో ఈ హింసాకాండ సాగించారని.. సయ్యద్ ఇష్తియాక్ ఆలం తన ట్వీట్ లో తెలిపారు. తాము సామరస్యాన్ని కోరుకుంటున్నామని అన్నారు. తాము తమ పండుగ మిలాద్-ఉల్-నబీని శాంతియుతంగా నిర్వహించుకుంటున్నప్పుడు.. ఈ ముగ్గురు వ్యక్తులు.. ఎక్బల్‌పూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బంగ్లాలో రహస్యంగా సమావేశమయ్యారని సయ్యద్ ఇష్తియాక్ తమ ట్విట్టర్ లో తెలిపారు. పోలీస్ స్టేషన్ లోపల సీన్ క్రియేట్ చేయడానికి షాబాజ్ తన అనుచరులను పోగేశాడు.

  ఇక, కోల్‌కతా విమానాశ్రయం మయూర్‌భంజ్‌లో తమ ఇళ్లపై దాడి జరిగిందని సుకాంత మజుందార్ అనే మరో బాధితుడు తెలిపారు. పరిస్థితి తీవ్రంగా వున్నప్పటికీ.. లా అండ్ ఆర్డర్ ఆర్డర్ లో లేదని అన్నారు. పోలీసులు మౌనపాత్ర వహించారని ఆరోపించారు. తమపై బాంబులు, ఇటుకలు విసరడంతో.. దిక్కుతోచని పరిస్థితిలో నాలుగు వైపులకు పరుగులు తీశామని స్థానిక హిందువుల తెలిపారు. హిందువులు ఎదుర్కొంటున్న కష్టాలను సీఎం మమతా బెనర్జీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీధుల్లో దుండగులు అల్లకల్లోలం చేసిన దృశ్యాలను బీజేపీ నేత ప్రీతమ్ సుర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

  ఇస్లాంవాదుల దాడికి గురైన హిందువులకు రక్షణ కల్పించాలని నందిగ్రామ్ బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. కేంద్ర బలగాలను అత్యవసరంగా మోహరించాలని కోరారు. ఎక్బాల్‌పూర్ పోలీస్ స్టేషన్ ను గూండాలు ముట్టడించి, పోలీసులను సైతం భయభ్రాంతులకు గురిచేసిన వీడియోను సువేందు అధికారి షేర్ చేశారు. ఇస్లామిక్ జెండాలు ఊపుతున్న ముష్కరమూక ఈ వీడియోలో కనిపించింది. పశ్చిమ బెంగాల్ సర్కారు తీరుపై సువేందు అధికారి విమర్శలు గుప్పించారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వారికి ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. మరో బీజేపీ నేత అమిత్ మాల్వియా షేర్ చేసిన విజువల్స్‌లో, ఇస్లాంవాదులు పూజా పండల్‌ను ధ్వంసం చేయడం కనిపించింది.

  Trending Stories

  Related Stories