More

    తిరుమలలో డ్రోన్ వీడియోపై టీటీడీ అప్రమత్తం.. యాంటీ డ్రోన్ తో నిఘా..!

    ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో డ్రోన్ సాయంతో శ్రీవారి ఆలయం వీడియో ఫుటేజీ చిత్రీకరించిన ఘటన తీవ్ర వివాదాస్పదం అయింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించడం కలకలం రేపింది. వెంకటాచల నాథుడి ఆలయానికి సంబంధించిన డ్రోన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలోని ఇన్ స్టాగ్రామ్ పేజీ ఐకాన్ అనే అకౌంట్ నుండి అప్ లోడ్ అయింది. హైదరాబాద్ కు చెందిన వ్యక్తులు డ్రోన్ షాట్స్ తీసినట్లు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో వీడియోను అప్లోడ్ చేసిన వారిని అదుపులోకి తీసుకొన్నారు.

    టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందిస్తూ తిరుమలలో డ్రోన్ సర్వేకు ఐవోసీఎల్‌కు పర్మిషన్ ఇచ్చింది వాస్తమేనని అన్నారు. కారిడార్ ఏర్పాటు చేసుకునేందుకు అన్నదానం దగ్గర నుంచి గార్బెజ్ సెంటర్ వరకు డ్రోన్ సర్వేకు ఐవోసీఎల్‌ పర్మిషన్ అడిగితే ఇచ్చామని చెప్పారు. ఆ ప్రాంతంలో మాత్రమే సర్వేకు అనుమతి ఉందన్నారు. తిరుమలలో భద్రతపై ఎక్కడా రాజీపడబోమని.. తిరుమలలో హై సెక్యూరిటీ వ్యవస్థ ఉందని అన్నారు. డ్రోన్ల వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు అయిందని వెల్లడించారు. త్వరలోనే తిరుమలకు అత్యాధునిక యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకువస్తున్నామని ధర్మారెడ్డి తెలిపారు. ఇది ఎంతో ఖరీదైన సాంకేతిక పరిజ్ఞానం అయినప్పటికీ, భద్రతకే ప్రాధాన్యత ఇచ్చి ముందడుగు వేస్తున్నామని స్పష్టం చేశారు. ఎవరైనా డ్రోన్లు ఎగరేస్తే, ఆ డ్రోన్లలో ఉండే కెమెరాలు పనిచేయకుండా యాంటీ డ్రోన్ వ్యవస్థ అడ్డుకుంటుందని తెలిపారు.

    Trending Stories

    Related Stories