తమిళనాట అన్నామలై వెరై‘టీ’ ఉద్యమం..! డీఎంకేకు ముచ్చెమటలేనా..?

0
627

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్దమయ్యాడు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ వివాదాస్పద జీవోతో వేలాదిమంది ప్రజల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. దీంతో డీఎంకే సర్కార్‎తో తాడో పేడో తేల్చుకోవడానికి రెడీ అయిపోయాడు అన్నామలై. డీఎంకే స్టాలిన్ ఏకపక్ష జీవోను వ్యతిరేకిస్తూ సాధారణ టీ తోటల పెంపకందార్ల కోసం పోరాటం చేయబోతున్నారు. తమిళనాడు ప్రభుత్వం ‘టాన్ టీ’ కార్పొరేషన్ చెందిన రెండు వేల 152 హెక్టార్ల స్థలాన్ని ఫారెస్ట్ డిపార్ట్ మెంట్‎లో కలిపేస్తూ తీసుకొచ్చిన జీవోను రద్దుచేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం జీవోను వెనక్కి తీసుకోకుంటే ఈ నెల 20వ తేదీన నీలగిరి జిల్లా గుడలూరులో బీజేపీ ఉద్యమాన్ని మొదలుపెడుతుందని హెచ్చరించారు. ఈ జీవో వల్ల 15 వేల కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనీ,.. దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసలు ఈ TANTEA కార్పొరేషన్ ఏమిటి..? తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ జీవోలో ఏముంది..? ఆ జీవో అమలైతే శ్రీలంక నుంచి వచ్చే సమస్య ఏమిటి..? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ముందు నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ ను సబ్ స్ర్కయిబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.

భారత్‎లో విరివిగా దొరికే టాన్ టీ అనే బ్లాక్ టీ ని తమిళనాడులో TANTEA అనే కార్పొరేషన్ ఉత్పత్తి చేస్తుంది. తమిళనాడులోని నీలగిరి కోయంబత్తూర్ జిల్లాల్లో దాదాపు నాలుగువేల ఎకరాల భూములు ఈ కార్పొరేషన్ కింద ఉన్నాయి. ఈ కార్పొరేషన్ ను నమ్ముకుని దాదాపు 15 వేల కుటుంబాల వరకు జీవనం సాగిస్తున్నాయి. ఈ భూముల్లో పండే టీ తోటలతో ఆయా కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే కొద్దిరోజులుగా ఈ కార్పొరేషన్ నష్టాల్లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సంస్థను ఆదుకోవాల్సింది పోయి దీన్ని సాకుగా చూపుతూ డీఎంకే ప్రభుత్వం వివాదాస్పద జీవోను తీసుకొచ్చింది. ఈ జీవోతో ‘టాన్ టీ’ కు చెందిన దాదాపు రెండు వేల ఎకరాల భూమిని నీలగిరి ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో కలపాలని స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సాకుగా ‘టాన్ టీ’ ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిందనీ,.. రెండు వేల హెక్టార్లను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కలిపేస్తే ప్రతిఏటా దాదాపు ఐదు కోట్ల వరకు ఖర్చు తగ్గించవచ్చని తెలిపింది. అయితే ఈ విధంగా కార్పొరేషన్ భూములను అటవీశాఖలో కలపడం వల్ల అక్కడ పనిచేసే కార్మికులు పెద్దయెత్తును ఉపాధి కోల్పోతారు. రెండు వేల హెక్టార్ల భూమిని అటవీ శాఖలో కలిపితే దాదాపు 15 వేల కుటుంబాలు ఉపాధిని కోల్పోయే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలను ఇతర ప్రాంతాలకు కూడా తరలించాల్సి వస్తుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారన్న కారణంగా అన్నామలై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమానికి పూనుకున్నాడు. టాన్ టీ కార్పొరేషన్ కు చెందిన భూములను అన్యాయంగా తరలించడం వల్ల వేల మంది ఉపాధి కోల్పోతారని తెలిపారు. దీంతో పాటు ఎన్నికల ముందు టాన్ టీ లోని కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చిన డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఉన్న ఉద్యోగులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అంతేకాదు, నాడు సిరిమావో-శాస్త్రి ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించినట్లవుతుందని అన్నామలై తెలిపారు.

1964లో నాటి శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకే, నాటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మధ్య కీలక ఒప్పందం జరిగింది. 1948 లో శ్రీలంకకు స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే అక్కడి ప్రభుత్వం శ్రీలంక తమిళులకు అంతగా ప్రాథాన్యత ఇచ్చేది కాదు. తమ దేశంలోని టీ తోటల్లోని తమిళులను భారత్ కు తీసుకెళ్ళాలని డిమాండ్ చేసింది. తర్వాత రోజుల్లో శ్రీలంక తమిళుల కోసం భారత్ శ్రీలంకల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఇందులో 1964లో సిరిమావో-శాస్త్రి మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా టాన్ టీ అనే కార్పొరేషన్ ఏర్పడింది. ఈ కార్పొరేషన్ లో భాగంగా శ్రీలంక తమిళులకు అటవీ ప్రాంతాన్ని ఇచ్చి తేయాకు తోటలు పండించుకునేందుకు ప్రభుత్వం సహాయపడింది. అలా కొన్ని దశాబ్దాలుగా వేలాది తమిళ కుటుంబాలు ఈ టీ తోటలపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే తాజా జీవో తో దాదాపు 15 వేల కుటుంబాలు ప్రమాదంలో పడటంతో వారందరి తరపున తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఉద్యమానికి దిగాడు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

two × four =