More

    యూపీలో ఘరానామోసం..! విస్తుపోయిన ఖాకీలు..!!

    భారత్‎లో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ వేగం పుంజుకుంది. మధ్యలో ఉత్పత్తి తగ్గడంతో కొన్ని రోజులు సమస్యలు ఎదురైనా.. టీకాల పంపిణీ వడివడిగా సాగుతోంది. అయినా, కొన్ని చోట్ల వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. కేరళ, కర్నాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వృథా కాకుండా పకడ్బందీగా పంపిణీ చేస్తున్నారు. కానీ, రాజస్థాన్, చత్తీస్ గఢ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, బీహార్, గుజరాత్, తమిళనాడు, యూపీ వంటి రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల వృథా తలనొప్పిగా మారింది. ఈ రాష్ట్రాల్లో ప్రతి రోజు కొన్ని వందల కొద్ది డోసులు చెత్తబుట్టల పాలవుతున్నాయి. టీకాల విషయంలో ప్రజలు మొగ్గుచూపకపోవడం కొంత,.. వ్యాక్సినేషన్ సిబ్బంది అవగాహనాలోపం కొంత.. ఇలా కారణాలేవైనా వ్యాక్సిన్ల వృథా ఆందోళనకు గురిచేస్తోంది. వ్యాక్సిన్ల వృథాపై నిఘా పెట్టిన పోలీసులకు.. యూపీలోని అలీఘర్ లో ఓ ఘరానా మోసం బయటపడింది. కొన్ని వర్గాలకు చెందిన సిబ్బంది నిర్వాకం చూసి.. యూపీ పోలీసులే ఆశ్చర్యపోయారు.

    అలీఘర్ లోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఓ ఏఎన్ఎం.. లబ్దిదారులకు వ్యాక్సిన్లు ఇచ్చినట్టు నటిస్తూ.. ఇవ్వకుండానే వాటిని డస్ట్ బిన్ లో పడేస్తోంది. ఆ ఘటికురాలి పేరు నేహా ఖాన్. ఆమె అలీఘర్ లోని జమాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంగా పనిచేస్తోంది. గత ఆదివారం రోజున ఎప్పటిలాగే డ్యూటీకి వచ్చిన ఈమె.. టీకా కోసం వచ్చిన లబ్డిదారుల భుజాలకు సూదిని గుచ్చి.. సిరంజీలోని వ్యాక్సిన్ ను వదలకుండానే తీసి చెత్తబుట్టలో వేసింది. దీంతో నేహా ఖాన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా.. కొవిడ్ వ్యాక్సిన్ తో నిండివున్న 29 సిరంజీలను డస్ట్ బిన్ లో గుర్తించారు.

    సీఎంవో కార్యాలయం ఫిర్యాదు మేరకు పోలీసులు ఏఎన్ఎం నేహా ఖాన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇంఛార్జ్ మెడికల్ ఆఫీసర్ అఫ్రీన్ జెహ్రాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వ్యాక్సిన్ల నిండివున్న 29 సిరంజీలను డస్ట్ బిన్ లో కనుగొన్నామని.. సివిల్ లైన్స్ సీవో విశాల్ చౌదరి తెలిపారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు ప్రారంభించామని తెలిపారు. లబ్దిదారులకు వ్యాక్సిన్లు ఇవ్వకుండానే ఇచ్చినట్టు పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారని.. దీనిపై ఐపీసీలోని వివిధ విభాగాల కింద ఏఎన్‌ఎం నేహా ఖాన్, అఫ్రీన్ జెహ్రాపై దాఖలు చేసినట్లు స్పష్టం చేశారు.
    అలీఘర్ ‌లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 203/176/465/427/120 బి 3/4 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడి దర్యాప్తు జరుగుతోంది.

    కొన్ని మైనార్టీ వర్గాలకు చెందిన వైద్య సిబ్బందే ఇలాంటి ఘనకార్యాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. నేహా ఖాన్ ఒక్కరోజే 29 కొవిడ్ వ్యాక్సిన్లను ఇవ్వకుండా లబ్దిదారులను మోసం చేసిందంటే.. అంతకుముందు మోసపోయిన లబ్దిదారులు ఇంకెంత మంది ఉంటారో అనేదే ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తున్న అంశం. తమకు వ్యాక్సిన్ ఇచ్చారని.. ఇక తమకేమీ కాదనే భరోసాతో బయటికి వెళ్లిన ఆ లబ్దిదారులకు కొవిడ్ సోకి ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యులు..? అసలు వీళ్ల ఉద్దేశం ఏమిటి..? సోషల్ డిస్టెన్స్ పాటించరు. మాస్కులు ధరించడంలోనూ నిర్లక్ష్యం. రోడ్లపైనే ఉమ్మేస్తూ వుంటారు. కొవిడ్ నిబంధనలు పాటించరు. పాజిటివ్ వచ్చినా రోడ్లపై తిరుగుతుంటారు. మైనార్టీల్లో అందరూ ఇలా చేస్తారని కాదు.. కొంతమంది కరుడుగట్టిన మతోన్మాద మనస్తత్వం కలిన వాళ్లు ఇలాంటి పనులు చేస్తూవుంటారు. వ్యాక్సిన్లంటే వీళ్లకు పరమ చిరాకు. అదికూడా భారతీయు వ్యాక్సిన్లంటే అస్సలు నచ్చదు. పైగా టీకాలపై దుష్ప్రచారం చేయడంలోనూ ముందుంటారు. వ్యాక్సిన్లు వేసుకుంటే నపుంసకత్వం వస్తుందని ప్రచారం చేసిన సందర్భాలు కూడా వున్నాయి. చివరికి చిన్నపిల్లలకు వేసే పోలియో చుక్కుల మందుపైనా వీరికి విశ్వాసం వుండదు. అసలే కరోనా మహమ్మారి పడగ నీడలో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచ దేశాలకు ఇలాంటి మూర్ఖుల వల్ల పెను ప్రమాదం పొంచివుంది.

    ఇలా.. లబ్దిదారులకు వ్యాక్సిన్లు ఇవ్వకుండా మోసం చేయడాన్ని వ్యాక్సిన్ జిహాద్ అనుకోవాలా..? ఇప్పటికే లవ్ జిహాద్ పేరుతో హిందూ బాలికల ప్రాణాలను హరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా వ్యాక్సిన్ జిహాద్ కు తెరలేపారు. ఇలాంటివి దేశవ్యాప్తం ఇంకా ఎన్నిచోట్ల జరుగుతున్నాయో. దేశంలోని అన్ని వ్యాక్సినేషన్ సెంటర్లపై నిఘావేసి ఇలాంటి ఘరానా మోసగాళ్లను గుర్తించాల్సిన అవసరం వుంది లేదంటే. ఇది చాలా ప్రమాదాలకు దారితీసే అవకాశం వుంది.

    Trending Stories

    Related Stories