More

    ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నంబర్ 1 స్థానంలోనే..!

    ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌న నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని నిలుపుకుంది. 2019 అక్టోబర్‌ నుంచి 2021 డిసెంబర్‌ వరకు రాష్ట్రంలో 451 అమెరికన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ఏపీకి వచ్చాయిని ‘ది నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలియేషన్‌ ఏజెన్సీ ఆఫ్‌ ది గవర్నమెట్‌ ఆఫ్‌ ఇండియా (Invest India)’ పేర్కొంది. రాష్ట్రంలో 974 కి.మీ. మేర దేశంలో రెండో పొడవైన తీర ప్రాంతం ఉండడం, రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు పుష్కలంగా ఉండడం పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని ఇన్వెస్ట్‌ ఇండియా తెలిపింది.

    క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ ఆంధ్రప్రదేశ్ విదేశీ పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌లో స‌త్తా చాటిందని బుధ‌వారం ఇన్వెస్ట్ ఇండియా వెలువరించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో స్ప‌ష్ట‌మైంది. 2019 అక్టోబర్‌ నుంచి 2021 డిసెంబర్‌ వరకు రాష్ట్రంలో 451 అమెరికన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏపీకి వచ్చాయిని ఆ నివేదిక‌ వెల్లడించింది.

    ఏపీలో ఆరు ఓడరేవులు, ఆరు విమానాశ్రయాలు, 1,23,000 కి.మీ రహదారులు, 2,600 కి.మీ రైలు నెట్‌వర్క్ ఉండడం, 24 గంటలపాటు విద్యుత్ సరఫరా ఉన్నందున పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నట్లు ఇన్వెస్ట్ ఇండియా అభిప్రాయపడింది. కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాలతో నీటి వనరులు సమృద్ధిగా ఉండడంతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి పుష్కలమైన వనరులు ఉన్నట్లు ఆ సంస్థ అంచనా వేసింది. 2018-19 నాటికి ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉండడంతో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చని ఇన్వెస్ట్ ఇండియా స్పష్టం చేసింది.

    Trending Stories

    Related Stories