More

    ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన జూనియర్ డాక్టర్లు

    ఏపీ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు ఊహించని షాకిచ్చారు. స్టైఫండ్ పెంపుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. తమకు చెల్లించే స్టైఫండ్ ను 42 శాతం పెంచాల్సిందేనని.. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని లేదంటే ఈ నెల 26 నుంచి ఔట్ పేషెంట్ సేవలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నెల 25వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని, 26 తేదీ నుంచి ఓపీ విధులకు హాజరుకాబోమని స్పష్టం చేశారు. 27వ తేదీ నుంచి అత్యవసర సేవలు తప్ప మిగతా వైద్య సేవలన్నీ బహిష్కరిస్తామని హెచ్చరించారు. మిగతా రాష్ట్రాల్లోని జూనియర్ డాక్టర్లకు అందించే స్టైఫండ్ తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో చాలా తక్కువ అని.. హౌస్ సర్జన్లకు ఇతర రాష్ట్రాల్లో రూ. 30 వేలు, స్పెషాలిటీ పీజీలకు రూ.65 వేలు, సూపర్ స్పెషాలిటీ పీజీలకు రూ.80 వేలు చెల్లిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మాత్రం హౌస్ సర్జన్లకు రూ.19 వేలు, స్పెషాలిటీ పీజీలకు రూ.44 వేలు, సూపర్ స్పెషాలిటీ పీజీలకు రూ.53 వేలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు.

    Trending Stories

    Related Stories