ఆంధ్రప్రదేశ్‌ కు వర్షాలు.. ఎప్పటి నుండి అంటే..!

0
1182

ఆంధ్రప్రదేశ్‌ని మరోసారి వర్షాలు పలకరించబోతున్నాయని వాతావరణ విభాగం చెబుతోంది. ఈ నెల 16 ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నవంబర్‌ 18 నుంచి వర్షాలు కురువనున్నాయని.. రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

కొద్దిరోజులుగా నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి ఆనుకుని కొనసాగుతున్న అల్పపీడనం ఆదివారం ఆగ్నేయ అరేబియా సముద్రంలో విలీనమైంది. మరోవైపు ఈ నెల 16న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో 18వ తేదీ నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే పరిస్థితులు నెలకొన్నాయి.