More

    కీలక మలుపు.. బాలీవుడ్ నటి అనన్య పాండే ఇంట్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సోదాలు

    బాలీవుడ్ నటి అనన్య పాండే ఇంటిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు. డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఎన్‌సిబి అధికారులు అనన్య పాండే ఇంట్లో సోదాలు చేశారు. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ చాట్‌లో ఓ బాలీవుడ్ నటి చాటింగ్ అనే వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే..! ఇలాంటి సమయంలో ఆమె ఇంట్లో సోదాలు జరిగాయి. ఎన్‌సిబి అధికారులు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు డ్రగ్స్ కేసులో అనన్య పాండేను విచారణకు పిలిచారు. అనన్య పాండే ఇంటిపై దాడులు చేసిన తరువాత, ఎన్‌సిబి బృందం షారుఖ్ ఖాన్ ఇంటికి మన్నత్ కు చేరుకుంది. అక్కడ సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.

    బాలీవుడ్ చుంకీ పాండే కూతురైన అనన్య ఇప్పుడు చాలా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న లైగర్ సినిమాలో కూడా అనన్య నటిస్తోంది. షారూఖ్ తనయుడు ఆర్యన్ కు అనన్య చాలా క్లోజ్ ఫ్రెండ్.యువనటితో ఆర్యన్ డ్రగ్స్ గురించి వాట్పాప్‌లో చాటింగ్ చేసినట్టు ఎన్సీబీ అధికారులు ముంబై కోర్టుకు ఇప్పటికే తెలిపారు.

    ఆర్యన్ ఖాన్ కు మాదక ద్రవ్యాల కేసులో పెట్టుకున్న బెయిలు పిటీషన్ ను ముంబై స్పెషల్ కోర్టు బుధవారం నాడు తోసిపుచ్చింది. గురువారం వరకూ ఆర్యన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. ఆర్యన్‌తో పాటు అర్బాజ్ మర్చెంట్, మున్‌మున్ ధమేఛా బెయిల్ దరఖాస్తులను కూడా కోర్టు నిరాకరించింది. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లోనే ఆర్య‌న్ ఉన్న త‌న కొడుకుకి బెయిల్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోన్న షారుఖ్ ఖాన్ జైలుకు వ‌చ్చాడు. ఆర్య‌న్ ఖాన్‌తో మాట్లాడి అత‌డి యోగ‌క్షేమాల గురించి షారుఖ్ తెలుసుకున్నాడు. గ్లాస్ డోర్ అవతల ఆర్యన్, ఇవతల షారుఖ్ కూర్చొని ఇంటర్ కామ్ ద్వారా మాట్లాడుకున్నారని నేషనల్ మీడియా చెబుతోంది. దాదాపు 18 నిమిషాల సేపు వీరు మాట్లాడుకున్నారని తెలిపారు. తన తండ్రితో మాట్లాడుతున్న సమయంలో ఎక్కువ సేపు ఆర్యన్ ఏడుస్తూనే ఉన్నాడట. ‘అయామ్ సారీ’ అని పదేపదే తన తండ్రికి చెప్పాడు. తీవ్ర భావోద్వేగానికి గురైన షారుఖ్, ఏడుపును కంట్రోల్ చేసుకున్నాడని చెపుతున్నారు. నేను నిన్ను నమ్ముతున్నానంటూ షారుఖ్ ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడని మీడియా సంస్థలు తెలిపాయి.

    Related Stories