అనకాపల్లి: జిల్లాలోని చోడవరంలో ఉద్రిక్తత నెలకొంది. వికేంద్రీకరణ మద్దతుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. అయితే ర్యాలీ అనంతరం సి.హెచ్ శ్రీనివాసరావు అనే యువకుడు బైక్కు నిప్పుపెట్టి తాను అంటించుకోబోయాడు. దీంతో పోలీసులు అతడ్ని అడ్డుకున్నారు. బైక్కు అంటుకున్న మంటలను ఆర్పేశారు.