Telugu States

అనకాపల్లిలో కూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి

అనకాపల్లి వద్ద రహదారిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. కింద ఉన్న వాహనాలపై పడడంతో ఇద్దరు మృతి చెందారు. నిర్మాణంలో ఉన్న వంతెన సైడ్‌ పిల్లర్‌ ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయి రహదారిపై వెళ్తున్న వాహనాలపై పడింది. దీంతో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఓ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వంతెన కూలడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వంతెన పెద్ద శబ్దంతో ఒక్కసారిగా కుప్పకూలడంతో జనాలు తీవ్ర భయాందోళనలతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి, ఘటన స్థలం వద్ద సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం ఘటనా స్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Image

హైవే విస్తరణలో భాగంగా ఇక్కడ భారీ వంతెన నిర్మాణం జరుగుతోంది. రెండేళ్ల నుంచి ఇక్కడ వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. బ్రిడ్జి పిల్లర్లు పెద్ద శబ్ధంతో కుప్పకూలిపోవడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో కారు, ఆయిల్‌ ట్యాంకర్‌ ధ్వంసమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ట్యాంకర్‌ లో ఉన్న వారికి గాయాలవడంతో వారిని అనకాపల్లిలోని ఆసుపత్రికి తరలించారు. కూలిన బ్రిడ్జి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బ్రిడ్జి కింద ఇంకెవరైనా చిక్కుకున్నారేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు నూకాలమ్మ దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. వంతెన పిల్లర్‌ కారుపై పడటంతో పూర్తిగా నుజ్జునుజ్జయింది. వంతెన సైడ్‌ పిల్లర్‌ ఒక్కసారిగా కూలిపోవడంతో వంతెన నిర్మాణంలో నాణ్యతపై స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం సంభవించడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ కు అంతరాయం ఏర్పడింది.

Image

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eleven − 9 =

Back to top button