More

    అనకాపల్లి జిల్లా.. తండ్రి, కుమారుడు మృతికి షార్ట్ సర్క్యూట్ కారణమా..?

    ఏపీలోని అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతి చెందారు. ఈ ఘటన వారి కుటుంబంలో తీరని దుఃఖం నింపింది. నగల వ్యాపారి నవర నానాజీ, అతడి కుమారుడు మౌలేశ్‌ ఇంటిలో విద్యుత్‌ మరమ్మతులు పనిచేస్తుండగా ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌కు గురై మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మౌలేశ్‌ దువ్వాడ విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్నాడని పోలీసులు తెలిపారు.

    నర్సీపట్నానికి చెందిన మల్లేశ్వరరావు అంబికా జ్యూయలర్స్‌ నిర్వహిస్తున్నారు. జ్యూయలర్స్‌ షాపు పైనే కుటుంబంతో నివాసముంటున్నారు. అంబికా జ్యూయలరీ షాపు మేడపైన అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో మంటలు చెలరేగాయి. వెంటనే షాపు యాజమాని మల్లేశ్వరరావు.. తన సోదరుడుకి ఫోన్ చేసి ప్రమాదం గురించి చెప్పాడు. సోదరుడు షాపు దగ్గరకు చేరేసేరికి దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఊపిరాడక మల్లేశ్వరరావు, ఆయన కొడుకు మౌలేష్ ప్రాణాలు కోల్పోయారు. భార్యతో పాటు కుమార్తెలకు గాయాలు కావడంతో హుటాహుటిన విశాఖ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    Trending Stories

    Related Stories