గోవులను తరలిస్తున్న కంటైనర్ పట్టివేత

0
898

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు సమీపంలో అక్రమంగా 58 గోవులను కంటైనర్‎లో తరలిస్తుండగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పట్టుకున్నారు. అనంతరం నక్కపల్లి పోలీస్‎స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. కంటైనర్‎లో తెల్లవారుజామున 58 గోవులను వెంపాడు నుండి హైదరాబాద్‎కు తరలిస్తుండగా తమకు సమాచారం వచ్చిందని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చెప్పారు. దీంతో కంటైనర్ పట్టుకుని పోలీస్‎స్టేషన్‎కి అప్పగించమని తెలిపారు. ఈ అక్రమ రవాణాకు కొంతమంది సహకారం అందిస్తున్నారని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గోవు హత్య మహాపాపం అని, గోవుని ఇలా కళేబాలకు తరలించడం కరెక్ట్ కాదన్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

thirteen − 4 =