దేశ రాజధాని ఢిల్లీలో అగ్ని ప్రమాదాన్ని మరువకముందే పంజాబ్ లో మరో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ ఆసుపత్రిలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక దళం మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తోంది. రోగులను సురక్షితంగా తరలిస్తూ ఉన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై విచారణ జరుపుతామని పంజాబ్ మంత్రి హర్భజన్ సింగ్ తెలిపారు.

భవనం వెనుక పార్కింగ్ ప్రాంతంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగడంతో మంటలు ఆసుపత్రిలోని ఎక్స్-రే విభాగానికి కూడా వ్యాపించాయి. భవనంలోని వివిధ వార్డుల్లో చేరిన రోగులను ఆసుపత్రి ఉద్యోగులు, అటెండర్లు సకాలంలో బయటకు తరలించారు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనాస్థలికి చేరుకుని 40 నిమిషాల్లో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో మూడు భవనాలు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. పరికరాల నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు.
