More

    అజ్ఞాతం వీడని అమృత్ పాల్ సింగ్.. రహస్య ప్రదేశం నుంచి వీడియో విడుదల..!

    అమృత్ పాల్ సింగ్ ను పంజాబ్ పోలీసులు వెతుకుతున్నారు. అతడు పలు ప్రాంతాలను మారుస్తూ తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. అయితే అతడు తాజాగా ఓ వీడియోను విడుదల చేశాడు. అమృత్ పాల్ సింగ్ అందులో మాట్లాడుతూ తనను పోలీసులు వెంటపడడం సిక్కు సమాజంపై దాడిగా అభివర్ణించాడు. ప్రభుత్వం కోరుకుని ఉండి ఉంటే తనను ఇంట్లోనే అరెస్టు చేసి ఉండవచ్చని అమృత్ పాల్ సింగ్ అభిప్రాయపడ్డాడు. తనను ఎవరూ బాధపెట్టలేరని, జైలు శిక్షకు కూడా భయపడనని అమృత్ పాల్ సింగ్ ప్రకటించాడు. ప్రజల హృదయాల్లో తానో చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని.. తన మీద ఉన్న చెడు అభిప్రాయాన్ని తొలగిస్తానని అన్నాడు. తల్వాండి సాబోలో బైస్కాహి సందర్భంగా సర్బత్ ఖల్సాని నిర్వహించాలని అకల్ తఖ్త్ జతేదార్ గియానీ హర్‌ప్రీత్ సింగ్‌ను కోరాడు.

    సిక్కులందరూ ఐక్యమత్యంతో ఉండాలని కోరాడు. చిన్న చిన్న సమస్యలపై పోరాటాలు చేయడంతో మునిగిపోయామని, పంజాబ్ సమస్యలు పరిష్కరించాలంటే అందరూ కలిసి తీరాల్సిందేనని అన్నాడు. పంజాబ్ ప్రభుత్వం తమను మోసం చేసిందని, ఎంతో మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారని ఆరోపించాడు. వారంతా ఎన్ఐఏ విచారణ ఎదుర్కొంటున్నారని, వీరిలో కొందరిని అస్సాంకు తరలించారని అమృత్ పాల్ సింగ్ అన్నాడు.

    మార్చి 18న భారీ ఆపరేషన్ నిర్వహించిన పంజాబ్ పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరోవైపు అతడు తప్పించుకోవడాన్ని హర్యానా హైకోర్టు తప్పుబట్టింది. ఎంతో మంది పోలీసులు ఉన్నా కూడా అతడు ఎలా తప్పించుకోగలిగాడని పంజాబ్ ప్రభుత్వాన్ని విమర్శించింది. ఇది పూర్తిగా ఇంటెలిజెన్స్ వైఫల్యం అని చెప్పింది. 80 వేల మంది పోలీసులు ఉన్నా.. పక్కా ప్రణాళికతో కూడిన ఆపరేషన్‌ చేయలేకపోయారని హర్యానా హైకోర్టు విమర్శలు గుప్పించింది. అతడిని పట్టుకునేందుకు తాము ఎంతగానో ప్రయత్నిస్తూ వస్తున్నామని, పంజాబ్ పోలీసులు హైకోర్టుకు తెలియజేశారు.

    మీడియా నివేదికల ప్రకారం అమృత్ పాల్ సింగ్ స్వర్ణ దేవాలయంలో లొంగిపోయే అవకాశం ఉంది. పంజాబ్ పోలీసులు బుధవారం ఆ ప్రాంతంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ పరిణామంపై ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. అమృత్ పాల్ సింగ్, అతని అనుచరులకు పాకిస్తాన్ ఐఎస్ఐ, ఖలిస్తానీ ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది.

    Trending Stories

    Related Stories