More

  అమ్నేషియా పబ్ కేసులో కీలక పరిణామం.. నిందితుల‌ను గుర్తించిన బాధితురాలు

  హైద‌రాబాద్ జూబ్లీ హిల్స్ ప‌రిధిలోని అమ్నేషియా ప‌బ్ గ్యాంగ్ రేప్‌న‌కు సంబంధించి నిందితుల గుర్తింపు ప్ర‌క్రియ‌ను పోలీసులు పూర్తి చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల‌ను ఇప్ప‌టికే పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో మేజ‌ర్ అయిన సాదుద్దీన్ చంచ‌ల్‌గూడ జైల్లో ఉండ‌గా.. మిగిలిన ఐదుగురు మైన‌ర్లు జువెనైల్ హోంలో ఉన్నారు. త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డ నిందితులు వీరేనంటూ బాధితురాలు పోలీసులు, న్యాయ‌మూర్తికి తెలిపింది. నిందితుల గుర్తింపు ప్ర‌క్రియ‌ను సోమ‌వారం పోలీసులు చేప‌ట్ట‌గా చంచల్‌గూడ జైలుతో పాటు జువెనైల్ హోంకు వెళ్లిన బాధితురాలు న్యాయ‌మూర్తి స‌మ‌క్షంలోనే నిందితుల‌ను గుర్తించింది. న్యాయ‌మూర్తి అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు బాధితురాలు వివ‌రంగానే స‌మాధాన‌మిచ్చింది. ఈ వివ‌రాల‌న్నింటినీ పోలీసులు న‌మోదు చేసుకున్నారు.

  మరో వైపు ఈ కేసులో నిందితులకు డీఎన్ఏ సేకరణ చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు కోర్టును ఆశ్రయించారు. జువైనల్ బోర్డుతో పాటు కోర్టు అనుమతిని పోలీసులు కోరనున్నారు. బాలిక అత్యాచారం కేసులో నిందితులైన ఐదుగురు మైనర్లు, సాదుద్దీన్ లకు డీఎన్ఏ సేకరణ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఇన్నోవా వాహనంలో లభ్యమయిన ఎవిడెన్స్ కు, ఈ డీఎన్ఏ పరీక్షలు అవసరమని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసు పరిశోధన మరింత శాస్త్రీయంగా జరుగుతుందన్నది పోలీసుల వాదన. వారి నుంచి డీఎన్ఏ సేకరించి ల్యాబ్ కు పంపాలన్న యోచనలో ఉన్నారు.

  spot_img

  Trending Stories

  Related Stories