More

    సంవత్సరానికి ఒకటిన్నర కోటి సంపాదిస్తున్న అమితాబ్ బాడీగార్డ్.. విచారణకు ఆదేశం..!

    బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ బాడీగార్డ్ గురించి తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. అమితాబ్ బచ్చన్ ద‌గ్గ‌ర జితేంద్ర షిండే అనే వ్య‌క్తి కొన్నేళ్లుగా బాడీగార్డ్‌ గా పని చేస్తున్నారు. జితేంద్ర‌కు జీతం ఏడాదికి రూ.1.5 కోట్లు అనే వార్తలపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. నెలకు రూ.13 లక్షల రూపాయ‌ల ఆదాయంపై పోలీస్ డిపార్ట్ మెంట్ విచారణ జరుపుతోంది. కానిస్టేబుల్ జితేంద్ర షిండేపై వార్షిక ఆదాయం 1.5 కోట్లకు పైగా ఉందని చెబుతూ ముంబై పోలీస్ శాఖ శాఖాపరమైన విచారణను ప్రారంభించింది. షిండేకు బిగ్ బి నుంచి డబ్బులు వచ్చాయా లేదా ఇతర మూలాల నుంచి వచ్చాయా అనే విషయంపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షిండే చాలా సంవత్సరాలుగా బచ్చన్ అంగరక్షకుడిగా పని చేస్తూ ఉన్నారు. ఇతర ప్రముఖులు మరియు ప్రముఖ వ్యక్తులకు వ్యక్తిగత అంగరక్షకులను అందించే సెక్యూరిటీ ఏజెన్సీని నిర్వహిస్తున్నట్లు జితేంద్ర షిండే పోలీసు అధికారులకు తెలియజేశారు. అమితాబ్ బచ్చన్ తనకు రూ .1.5 కోట్లు చెల్లించలేదని పోలీసులకు తెలిపారు.

    దక్షిణ ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. షిండే సొంతంగా ఓ సెక్యూరిటీ ఏజెన్సీని నడుపుతున్నట్టు, పలువురు ప్రముఖులకు భద్రత కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఆ సంస్థను తన భార్య నడుపుతోందని, దాంతో తనకు సంబంధం లేదని షిండే చెబుతున్నాడు. అమితాబ్ తనకు అదనంగా ఏమీ ఇవ్వట్లేదని తెలిపాడు. ఐదేళ్లకు మించి ఓ ప్రముఖుడి దగ్గర ఒకే బాడీగార్డ్ పనిచేయకూడదన్న నిబంధన ఉందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. షిండే 2015 నుంచి అమితాబ్ కు బాడీగార్డ్ గా పనిచేస్తున్నారు. అమితాబ్ కు ఎక్స్ కేటగిరీ భద్రతను ప్రభుత్వం కల్పిస్తోంది. అందులో భాగంగా ఇద్దరు కానిస్టేబుళ్లు ఆయనకు బాడీగార్డులుగా ఉంటున్నారు. అందులో షిండే అంటే తనకు వ్యక్తిగతంగా చాలా ఇష్టమంటూ అమితాబ్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

    Related Stories