More

    ఆరా తీసిన కేంద్ర మంత్రి అమిత్ షా

    బీజేపీ ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్రదండి గ్రామంలో ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన ఎంపీని టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎంపీ కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. టీఆర్ఎస్ గూండాలే ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్‌పై దాడి చేశారని ఆరోపించారు బీజేపీ నేతలు. ఈ ఘటనను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా తీవ్రంగా తప్పుబట్టారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తనను అడ్డుకోవడంపై అర్వింద్ మండిపడ్డారు. ఇక్కడి గోదావరి ముంపు బాధితులకు ప్రభుత్వం గతంలో పట్టాలిచ్చిందని.. కానీ ఆ భూములను స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తమ బంధువులకు ఇప్పించుకున్నారని అర్వింద్ ఆరోపించారు. ఈ తప్పును ఎత్తిచూపుతానన్న భయంతోనే తనపై దాడికి పాల్పడ్డారని అన్నారు. ఈ దాడిపై అమిత్ షా ఆరా తీశారు. ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని అమిత్ షా‌కు అర్వింద్ వివరించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ దాడులు చేస్తోందని అమిత్ షాకు చెప్పారు.

    టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ల నియంతృత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకే బీజేపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలు అసహ్యించుకుంటున్నా.. వారిలో మార్పు రాకపోవడం దారుణమని విమర్శించారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని.. ఇది ముమ్మాటికీ పిరికి పందల చర్యేనని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యవాదులంతా టీఆర్ఎస్ దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.

    spot_img

    Trending Stories

    Related Stories