హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ దూసుకుపోతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఫోన్ చేశారు. హుజూరాబాద్ ఫలితాలపై అభినందనలు తెలిపారు. కార్యకర్తలు కష్టపడి పనిచేశారని బండి సంజయ్ అమిత్‌షాకు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హుజూరాబాద్ ఫలితాలపై సంబరాలు చేసుకుంటున్నారు కార్యకర్తలు. బాణసంచా, డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో కార్యకర్తల సంబరాలు జరుపుకుంటున్నారు.
16వ రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 1742 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రౌండ్‌లో బీజేపీకి 5689 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్‌కు 3977 ఓట్లు వచ్చాయి. మొత్తానికి 13,195 ఓట్ల మెజార్టీతో బీజేపీ మొదటిస్థానంలో ఉంది.
15వ రౌండ్ లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 5,507 ఓట్లు రాగా.. గెల్లు శ్రీనివాస్‌కు 3,358 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు 149 ఓట్లు వచ్చాయి. 15 రౌండ్లలోనూ కలిపి బీజేపీకి 68,586 ఓట్లు రాగా.. టీఆర్ఎస్‌కు 57,003 ఓట్లు, కాంగ్రెస్‌కు 2131 ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 15 రౌండ్లలో కలిపి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మెజారిటీ 10 వేల మార్కును దాటింది.