కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 21న ఆయన హైదరాబాదుకు రానున్నారు.. ఈ పర్యటనలో ఆయన ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావును కలవనున్నారు. ఈ భేటీపై చర్చ జరుగుతోంది. ఈ నెల 21న మధ్యాహ్నం 3.40 గంటలకు ఆయన శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగనున్నారు. అక్కడి నుంచి బయల్దేరి 4.15 గంటలకు మునుగోడుకు చేరుకుంటారు. అక్కడ 4.35 గంటలకు సీఆర్పీఎఫ్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం 4.40 నుంచి 6 గంటల వరకు అక్కడి బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గంలో రామోజీ ఫిలిం సిటీకి చేరుకుంటారు. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావును కలుస్తారు. రామోజీ ఫిలిం సిటీలో 6.45 నుంచి 7.30 వరకు ఉంటారు. శంషాబాద్ లోని నొవోటెల్ హోటల్ చేరుకుంటారు. అక్కడ 8 నుంచి 9.30 గంటల వరకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహిస్తారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేస్తారు. అనంతరం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు.