More

    మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటూ నవ్వులు పూయించిన అమిత్ షా

    కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. తన వాయిస్ హై పిచ్ లో ఉంటుందని, అందుకే తాను మాట్లాడితే చాలా గట్టిగా మాట్లాడినట్టు ఉంటుందని ఆయన అన్నారు. తన మాటతీరే అంతని దాన్ని కోపం అనుకోవద్దని చెప్పారు. తన గొంతు హైపిచ్ లో ఉండటానికి కారణం మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ అని అమిత్ షా అనడంతో సభలో ఉన్న సభ్యులు గట్టిగా నవ్వేశారు.

    తాను ఎవరినీ తిట్టనని అన్నారు. తనకు అస్సలు కోపమే రాదని, అయితే కశ్మీర్ కు సంబంధించిన ప్రశ్నలు అడితే మాత్రం కోపం వస్తుందని అమిత్ షా అన్నారు. క్రిమినల్ ప్రొసీజర్ బిల్ 2022ని సభలో మూవ్ చేస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమిత్ షాకు కోపం ఎక్కువని విపక్ష నేతలు చేసిన కామెంట్ కు సమాధానంగా ఆయన ఈ రిప్లై ఇచ్చారు అమిత్ షా. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

    పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాల చివరి వారంలో భాగంగా ”క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ బిల్ 2022”ను ఆయన సభలో ప్రవేశపెట్టారు. నేర పరిశోధనను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా చేయడం, నేరారోపణ రేటును పెంచడం క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేష్ బిల్లు లక్ష్యం అని అమిత్ షా అన్నారు. ఈ బిల్లు ఇప్పటికే చాలా ఆలస్యమైందని అన్నారు. గోప్యత హక్కుతో సహా బిల్లుపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనను తగ్గించాలని కేంద్ర హోంమంత్రి ప్రయత్నించారు. 1980లో ప్రిజనర్స్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ 1920ని పునఃపరిశీలించాలని లా కమిషన్ తన నివేదికలో భారత ప్రభుత్వానికి ప్రతిపాదన చేసిందని ఆయన వివరించారు. సమయం వచ్చినప్పుడల్లా దానిపై చర్చ జరుగుతూనే ఉందన్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాష్ట్రాలతో తాము సంప్రదింపులు జరిపామని, వారి అభిప్రాయాలు తెలుసుకున్నామని చెప్పారు.

    Trending Stories

    Related Stories