కోలార్ క్లాక్ టవర్ పై 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఎగిరిన త్రివర్ణ పతాకం

0
742

75 ఏళ్ల తర్వాత తొలిసారిగా శనివారం నాడు కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ క్లాక్ టవర్‌పై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. కోలార్‌లోని ప్రసిద్ధ క్లాక్ టవర్‌పై ఇప్పటి వరకూ ఇస్లామిక్ జెండాలు ఎగురవేయబడ్డాయి. ఏడు దశాబ్దాలుగా ఆకుపచ్చ రంగులో క్లాక్ టవర్ కు పెయింట్ చేశారు. ఇప్పుడు అన్నీ మారిపోయాయి. భారత జాతీయ జెండాతో క్లాక్ టవర్ ను అలంకరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మోహరించి.. పెయింటిక్ కార్మికులకు పోలీసులు భద్రత కల్పించి మరీ క్లాక్ టవర్‌కు తెల్లటి రంగు వేశారు.

శనివారం జిల్లా అధికారులు క్లాక్ టవర్‌పై ఎగురవేసిన ఇస్లామిక్ జెండాలను తొలగించే సమయంలో కోలారు పోలీసు సూపరింటెండెంట్ డి.దేవరాజు అక్కడే ఉన్నారు. జిల్లా అధికారులు ఇస్లామిక్ జెండాలను తొలగించడంతో నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపు చేయడంతో శనివారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అనంతరం నూతనంగా అలంకరించిన క్లాక్ టవర్ వద్ద భారత జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు కోలార్ జిల్లా పోలీసులు స్థానిక ముస్లిం ప్రజలతో సహా వచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది, క్లాక్ టవర్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నందుకు పలువురు నెటిజన్లు జిల్లా అధికారులను ప్రశంసించారు.

కోలార్‌లోని లోక్‌సభ ఎంపీ మునిస్వామి క్లాక్ టవర్‌పై ఎగురవేసిన ఇస్లామిక్ జెండాలను తీసి వేసి.. అదే స్థలంలో భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తామని గతంలో స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. క్లాక్ టవర్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా అధికారులు 144 సెక్షన్ విధించారు. 74 ఏళ్ల నిరీక్షణ తర్వాత క్లాక్ టవర్‌పై భారత త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేసిందని ముని స్వామి శనివారం ట్విట్టర్‌లో ప్రకటించారు. ఒకప్పుడు అక్కడ ఎలా ఉండేదో.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో పలువురు షేర్ చేశారు.