లౌడ్ స్పీకర్ల తొలగింపుపై అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు

0
803

లౌడ్ స్పీకర్ల వివాదం మహరాష్ట్రను కుదిపేస్తోంది. మహరాష్ట్రలో పర్యటించిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ లౌడ్ స్పీకర్ల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగాబాద్‌లో మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి ఔరంగ‌జేబు స‌మాధి వ‌ద్ద అక్బ‌రుద్దీన్ పుష్ప నివాళి అర్పించారు.

రాజ్ థాక‌రే గురించి మాట్లాడేందుకు తాను ఇక్క‌డ‌కు రాలేద‌న్నారు. గుర్తింపు లేని వారి గురించి ఎందుకు మాట్లాడాల‌ని ఆయ‌న అన్నారు. స్వంత ఇండ్ల నుంచి పంపించిన వారి గురించి ఏం మాట్లాడాల‌ని ప్ర‌శ్నించారు. ఎవ‌రి గురించి భ‌య‌ప‌డేది లేద‌న్నారు. అయితే అక్బ‌రుద్దీన్ మ‌హారాష్ట్ర‌లో టూర్ చేయ‌డాన్ని శివ‌సేన‌, బీజేపీలు త‌ప్పుప‌ట్టాయి.

మహరాష్ట్రలో పర్యటనలో భాగంగా ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సింహాలు నడుస్తుంటే కుక్కలు మొరుగుతుంటాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నవ నిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే మొరిగే కుక్క అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ఎంత మొరుగుతున్నా మనం మాత్రం సైలెంట్ గా ఉండాలంటూ కార్యకర్తలకు హితవు పలికారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై శివసేస, మహరాష్ట్ర నవ నిర్మాణ సేన, ఆ రాష్ట్ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడుతున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here