More

    మహరాష్ట్రలోనూ జ్ఞానవాపి..!

    ఉత్తరప్రదేశ్ జ్ఞాన్‌వాపి మసీదు వివాదం కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని పుణే నగరంలో పుణ్యేశ్వర్‌ ఆలయ భూముల్లో దర్గాలను నిర్మించారని రాజ్‌థాక్రే నేతృత్వంలోని ఎంఎన్‌ఎస్‌ వెల్లడించింది.

    ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్‌ షిండే మాట్లాడుతూ పుణ్యేశ్వర ముక్తి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఆలయ భూమిని పునరుద్ధరించడంలో రాజ్ థాకరే నేతృత్వంలోని పార్టీ పోరాటానికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జ్ఞానవాపి లాగే పుణేలోని పుణ్యేశ్వరాలయం కోసం కూడా పోరాడుతున్నామన్నారు. ఖిల్జీ వంశానికి చెందిన అల్లావుద్దీన్ ఖిల్జీ కమాండర్ పుణేలోని పుణ్యేశ్వర్, నారాయణేశ్వర్ ఆలయాలను కూల్చివేశాడని, ఆ తర్వాత ఆ భూమిలో దర్గాలు నిర్మించారని షిండే అన్నారు.

    మరోవైపు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాక్రే ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కీలక విజ్ఞప్తి చేశారు. దేశంలో జనాభాను నియంత్రించేందుకు చట్టంతో పాటు ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని తీసుకురావాలని కోరారు. పూణేలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి పౌరస్మృతి వీలైనంత త్వరగా తీసుకురావాలని నేను ప్రధానిని కోరుతున్నానన్నారు. దీంతో పాటు జనాభాను నియంత్రించే చట్టాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఔరంగబాద్ పేరును సంభాజినగ గా పేరు మార్చాలని కోరారు. ఇవన్నీ చేస్తే సమస్యలకు ముగింపు ఉంటుంది అని అన్నారు. రెండు రోజుల క్రితమే ఆయోధ్య టూర్ ను వాయిదా వేస్తూ ట్వీట్ చేసినట్లు తెలిపారు. అయోధ్య పర్యటనకు వ్యతిరేకంగా ఉన్నవారు తనను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ ఈ వివాదంలో పడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాగా, లౌడ్ స్పీకర్లు తొలగిస్తానని రాజ్ థాక్రే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కేసు నమోదు చేశారు.

    Trending Stories

    Related Stories