More

  చీకట్లను చీల్చుతున్న ప్రముఖుల హత్యలు..! సీఐఏ ముసుగులోకి అమెరికా అకృత్యాలు

  అమెరికాను అగ్రరాజ్యం అనడం కంటే అకృత్యాలు, అరాచకాల రాజ్యం అనడం సమంజసమేమో..! ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తుంది. ఇతర దేశాలను అణచివేయడంలో ఎంత వరకైనా దిగజారుతుంది.

  అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే అమెరికాకు అక్కుసు. అన్ని రంగాల్లో తమను ఎక్కడ మించిపోతాయోననే భయంతో నిత్యం ప్రపంచ దేశాలపై కుట్రలు చేస్తూనే ఉంటుంది. సీఐఏ ముసుగులో అమెరికా చేసిన హత్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యలు అలాంటి ఇలాంటి హత్యలు కావు.. ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు, శాస్త్రవేత్తలపై కుట్రలు పన్ని అతి దారుణంగా హత్యలకు పాల్పడ్డారు.

  CIAను అడ్డుపెట్టుకుని అమెరికా చేసే అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. తమకు అడ్డం అనుకున్న వారికి.. తమ హోదాకు అడ్డు తగులుతారు అనుకునేవాళ్లను.. కుట్ర చేసి మరీ ప్రాణాలు తీస్తుంటుంది. అందులో కొందరు క్షేమంగా బయటపడితే.. మరికొందరు చరిత్రలో పేజీగా మిగిలిపోయారు. హోమీ బాబా నుంచి.. ఫిడెల్‌ కాస్ట్రో వరకు… భారత మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి నుంచి అసాంజే వరకు.. సీఐఏ చేసిన కుట్రలకు లెక్కే లేదు.. తమ మాట పట్టించుకోని వారు.. తమ స్థానానికి ఎసరు తెస్తారు అని అనుకున్న వాళ్లను.. సీఐఏను అడ్డుపెట్టుకొని హతం చేయడం అమెరికాకు మొదటి నుంచి ఉన్న అలవాటు. హోమీ భాభా నుంచి ఇప్పుడు రష్యా, యుక్రెయిన్ యుద్ధంలో సీఐఏ అమలు చేస్తున్న విధానాల వరకు.. అమెరికా బుద్ది ఏంటో ఎలాంటి కుట్రలు చేస్తున్నాయో ప్రపంచానికి అర్థం అవుతూనే ఉంది. రష్యాతో సన్నిహితంగా ఉండడం.. అణ్వాస్త్ర ప్రయోగాలకు భారత్ వేగంగా అడుగులు వేయడం.. అమెరికా జీర్ణించుకోలేకపోయింది. ఫాదర్ ఆఫ్‌ ఆటమిక్‌ ఎనర్జీ అని పిలిచే హోమీ భాభాను.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అండగా ఉంటామని మద్దతు తెలిపిన లాల్‌ బహదూర్ శాస్త్రిని సీఐఏ కుట్ర చేసి చంపేసింది. ఆధారాలు చూపించలేకపోవచ్చు.. కానీ వీటి వెనక ఉన్నది మాత్రం సీఐఏ అనడానికి రాబర్ట్ క్రాలీ మాటలే సాక్ష్యం.

  లాల్‌ బహదూర్‌ శాస్త్రి, హోమీ బాబా మరణాలపై ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్నాళ్లు అనుమానాస్పద మృతిగా చరిత్రలో నిలిచిపోయిన భారత మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రిది… హత్య అని నిర్ధారణ అయింది. భారత అణుశాస్త్ర పితామహుడు హోమి జహంగీర్‌ బాబా కూడా విమానప్రమాదంలో మరణించలేదని… అది కూడా భారీ కుట్రతో చేసిన హత్య అని తేలిపోయింది. అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ సీఐఏ.. ఈ రెండు హత్యల వెనక ఉందనేది స్పష్టం అయ్యింది. దీంతో అమెరికా అసలు బుద్ధి నగ్నంగా బయటపడింది. అయితే లాల్‌ బహదూర్‌ శాస్త్రి, హోమీ బాబా మరణాలకు కేవలం 13 రోజుల వ్యవధి మాత్రమే తేడా. 1966 జనవరి 11న లాల్‌ బహదూర్‌ శాస్త్రి గుండెపోటుతో చనిపోతే.. ఆ తర్వాత 13 రోజులకు హోమీ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. భారత్ అణు ప్రయోగాలకు సిద్ధమవుతోన్న సమయంలో.. ఈ ఇద్దరి మృతిపై అప్పుడు మొదలైన అనుమానాలు.. నిన్న మొన్నటి వరకు కంటిన్యూ అయ్యాయ్. ఐతే ఇప్పుడు రాబర్ట్‌ క్రాలీ వ్యాఖ్యలతో.. అవి హత్యలే అని నిర్ధారణ అయింది. లాల్‌ బహదూర్‌ శాస్త్రి, హోమీ బాబా మరణాలు జరిగినప్పుడు.. సీఐఏ ఆపరేషన్స్‌ బాధ్యతలు నిర్వహించిన రాబర్ట్‌ క్రాలీ.. స్వయంగా కీలక విషయాలు బయటపెట్టారు. తన పుస్తకంలో సంచలన విషయాలను వెల్లడించారు.

  ఆవులను ప్రేమించే భారతీయులు ఎంతో తెలివైనవారని.. ప్రపంచంలో వారు గొప్ప శక్తిగా ఎదగబోతున్నారని.. భారతీయులు స్వయం సమృద్ధి సాధించడాన్ని తాము కోరుకోలేదని.. అని రాబర్ట్‌ క్రాలీ తన పుస్తకంలో రాసుకొచ్చారు. అణ్వాయుధ కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్లడంలో శాస్త్రి, బాబా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో.. రష్యాతో భారత్‌ సన్నిహితంగా ఉంటుండడంతో.. ఆ చర్యలు అమెరికాకు ఎప్పటికైనా ముప్పేనని గ్రహించి.. వారి హత్యకు సీఐఏ కుట్ర పన్నిందని క్రాలీ వివరించారు. భారతీయులు అణుబాంబును తయారు చేస్తే.. దాన్ని తొలుత తమ శత్రుదేశమైన పాకిస్థాన్‌ పైనే వేస్తారని భావించామని ఆయన వివరించారు. భారత్‌ను అణ్వాయుధ దేశంగా మార్చే శక్తి బాబాకు ఉందని.. అతను ఎప్పటికైనా దాన్ని సాధిస్తాడని.. అందుకే అతన్ని చంపాలని సీఐఏ నిర్ణయించిందని వివరించారు. హోమి బాబాను ఎయిర్‌ ఇండియా విమానంలో వియన్నా వెళ్తుండగా హతమార్చామని చెప్పారు. ఈ ప్రమాదంలో బాబాతోపాటు.. విమానంలో ఉన్న 116మంది చనిపోయారు. అలాగే ఆసియాలో వరి సాగు అనేదే లేకుండా చేసేందుకు కూడా సీఐఏ కుట్ర పన్నిందని రాబర్ట్‌ తన పుస్తకంలో వివరించారు. అందుకోసం ఓ వ్యాధిని అభివృద్ధి చేశామంటూ సంచలన విషయాన్ని వివరించారు. వరి లేకుంటే ఆసియా ప్రజలు ఆకలితో అలమటించి మరణిస్తారని తాము అంచనా వేసినట్లు చెప్పారు. కాని, దాన్ని అమలు చేయలేకపోయామన్నారు.

  అలాగే 1990వ దశకంలోనూ భారత శాస్త్రవేత్తలపై అమెరికా కుట్రలు పన్నింది. ఒక దేశ భక్తుడి పరువు తీయాలంటే.. అతనిపై దేశ ద్రోహిగా ముద్రవేస్తే సరిపోతుందని అగ్రరాజ్యం నమ్మింది. అమెరికా అదే చేసింది. భారత్ కు క్రయోజనిక్ టెక్నాలజీని అందించాలని భావించిన శాస్త్రవేత్త నంబి నారాయణ్‎ను దేశ ద్రోహిగా ముద్రవేయించింది. దీని ద్వారా భారత్ కు క్రయోజనిక్ టెక్నాలజీని దూరం చేయవచ్చని భావించింది. అంతే, తన వేగులను రంగంలోకి దింపి.. మాల్దీవుల నుంచి కథ నడిపించింది. 1994లో మాల్దీవులకు చెందిన ఇద్దరు ఇంటెలిజెన్స్ అధికారులైన.. మరియం రషీదా, ఫౌజియా హుస్సేన్‌ లకు.. ఫ్లయిట్ టెస్ట్ డేటా, రాకెట్, ఉపగ్రహ ప్రయోగాల వివరాలను పాకిస్తాన్ కు అమ్ముకున్నారని భారత్ ను నమ్మించింది. దీంతో నాడు క్రయోజెనిక్స్ శాఖకు ఇంఛార్జ్‌గా వున్న సైంటిస్ట్ నంబి నారాయణన్‎తో పాటు.. మరో శాస్త్రవేత్త శశికుమరన్‌‌లపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మరియం రషీదా, ఫౌజియా హుస్సేన్‌‌లతోపాటు వారిని కూడా అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. దీంతో నంబి నారాయణన్ 50 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ కేసు కేరళ పోలీసుల నుంచి సీబీఐకి కేసు 1996లో బదిలీ అయ్యింది. అయితే, నంబీ నారాయణ్ పై వచ్చిన ఆరోపణలకు రుజువులు లేవని చెబుతూ సీబీఐ కేసును మూసేసింది.

  ఈ ముగ్గుర్ని మాత్రమే కాదు.. అలుపెరుగని పోరాటంతో అగ్రరాజ్యం కుయుక్తులను ఎదుర్కొని.. క్యూబాను స్వతంత్ర్య దేశంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన ఫిడేల్ కాస్ట్రోను హతమార్చడానికి సీఐఏ చేయని ప్రయత్నం లేదు. 1959 నుంచి 1976 వరకు క్యూబా ప్రధానిగా.. 1976 నుంచి 2008 వరకు క్యూబా అధ్యక్షుడిగా.. కాస్ట్రో చేపట్టిన సంస్కరణలు క్యూబాను స్వతంత్ర శక్తిగా నిలబెట్టాయి. అంతేకాదు.. అమెరికాను ఎదిరించి .. పక్కలో బల్లెంలా మారడంతో క్యాస్ట్రోను అడ్డుతొలిగించుకోవడానికి సీఐఏ తీవ్రంగా ప్రయత్నించింది. ఆయన తాగే పొగాకు చుట్టల్లో బాంబులు పెట్టడంతో పాటు, విషకన్యలను పంపించడం వరకూ ఎన్నో కుట్రలు చేసింది. పక్కాగా చెప్పాలంటే.. 638 సార్లు ఆయనపై అమెరికా హత్యాయత్నానికి ప్రయత్నించింది. సీఐఏను అడ్డుపెట్టుకొని అమెరికా చేసిన ప్రతీ కుట్రను కాస్ట్రో సమర్థంగా ఎదుర్కొన్నారు. ప్రాణాలతో బయటపడ్డారు.

  క్యూబా జనాల్లో కాస్ట్రో ఆదరణ పొందడానికి.. ఆయన గడ్డం కూడా ఓ కారణమేనని సీఐఏ బలంగా నమ్మేది. ఆయన గడ్డాన్ని తొలగించడానికి అమెరికా చేసిన విఫల ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. థాలియం లవణంతో కూడిన ఓ పౌడర్‌ను కాస్త్రోపై ప్రయోగించింది. ఈ కెమికల్‌ ఎఫెక్ట్ అయితే మనిషి తన శరీరంపై ఉన్న వెంట్రుకలను పూర్తిగా కోల్పోయి వికృతంగా తయారవుతాడు. 1975లో సెనేట్ ఇంటిలిజెన్స్ కమిటీ రిపోర్టు ఈ విషయం బయటపెట్టింది. ఐతే ఆ ప్రమాదం నుంచి కాస్త్రో తప్పించుకున్నారు. ఇక కాస్ట్రో మాజీ భార్య మారిటా లారెంజ్‌ ద్వారా కూడా.. ఆయనను చంపేందుకు సీఐఏ ప్రయత్నాలు చేసింది. విషపు మందుబిళ్లలతో చంపేయాలని లారెంజ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటికే విషయాన్ని పసిగట్టిన కాస్ట్రో.. ఆమెపై గన్ను ఎక్కుపెట్టి నిలదీశారు. దీంతో నిజం బయట పడింది.

  పెన్నులాంటి ఇంజక్షన్‌తో సీఐఏ కాస్ట్రో శరీరంలోకి విష ప్రయోగం చేసింది. దాన్నుంచి కూడా ఆయన బయటపడ్డారు. సిగరెట్ బాంబును కూడా ప్రయోగించింది. ఫిడెల్ కాస్ట్రో చాలా ఇష్టపడే స్కూబా డైవ్ సూట్‌లోనూ.. పేలుడు పదార్థాలతో, అత్యంత ప్రమాదకర ఫంగస్ బ్యాక్టీరియాతో ఆయనను చంపేందుకు సీఐఏ ప్రయత్నించింది. ఫిడెల్ ప్రసంగించే రేడియో స్టేషన్‌ను కూడా పేల్చేందుకు ప్రయత్నించింది. హ్యాండ్ కర్చీఫ్‌లో ప్రమాదకర బ్యాక్టీరియాను నింపి ఓసారి.. పాలల్లో విషం కలిపి మరోసారి కాస్త్రోను చంపేందుకు ప్రయత్నించింది. ఇలా దాదాపు ఆరు వందలసార్లు తనపై హత్యాయత్నం జరగగా.. సీఐఏ కుట్రల నుంచి కాస్ట్రో ప్రతీసారి తప్పించుకున్నారు.

  వెనిజులా మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ మీద కూడా సీఐఏ కుట్ర చేసిందన్న అనుమానాలు ఉన్నాయి. 2013లో చావెజ్‌కు కేన్సర్‌ నిర్ధారణ అయింది. అయితే ఆ సమయంలోనే బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రూసెఫ్, పరాగ్వే అధినేత ఫెర్నాండో లుగో, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇనాషియో లులా దసిల్వా, అర్జెంటీనా అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్ డి కిర్చ్‌నర్‌లకు కేన్సర్ సోకింది. కొద్దిరోజుల వ్యవధిలోనే లాటిన్ అమెరికన్ దేశాల నేతలందరికీ కేన్సర్ సోకడం వెనక.. సీఐఏ కుట్ర ఉందన్న చర్చ నడిచింది. లాటిన్ అమెరికా దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి.. సీఐఏ ద్వారా అమెరికా డెడ్లీ గేమ్ ఆడిందన్న విమర్శలు ఉన్నాయి.

  చరిత్రలో మాత్రమే కాదు.. వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు అసాంజే హత్యకు కూడా ట్రంప్‌ హయాంలో కుట్ర జరిగింది. సీఐఏ డైరెక్టర్‌ మైక్‌ పాంపియా నేతృత్యంలో అసాంజేను హత్య చేసేందుకు గల అవకాశాలను పరిశీలించినట్లు బయటకొచ్చిన వార్తలు కలకలం రేపాయి. ఇక అటు ఉత్తరకొరియా అధ్యక్షుడు అకస్మాత్తుగా కనిపించకుండా పోతే ఎలా అని ఓ సమయంలో సీఐఏ అధ్యక్షులు వ్యాఖ్యలు చేయడం.. వారి టార్గెట్ ఏంటో చెప్పకనే చెప్పింది. వీటితో పాటు రష్యా యుద్ధంలో.. యుక్రెయిన్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా.. తమ దేశ ఇంటెలిజెన్స్ ద్వారా.. రష్యా ఆర్మీలో కీలక నేతలను మట్టుబెట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా పేరుకు మాత్రమే అమెరికా అగ్రరాజ్యం.. ఆ హోదాను నిలబెట్టుకునేందుకు ఎన్ని దగుల్బాజీ పనులు చేయాలో.. సీఐఏ ద్వారా అన్నీ చేస్తోందన్న విమర్శలున్నాయి. కానీ.. నిలదీసి అడిగేవాళ్లే లేరు.. అంతర్జాతీయ న్యాయస్థానంలో దోషిగా పెట్టేందుకు సాక్ష్యాలూ దొరకవు.. అందుకే.. సీఐఏ ఆటలు ఇంకా చెల్లుతున్నాయి. కానీ అగ్రరాజ్యాన్ని అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టే రోజు మాత్రం రాకమానదు.

  spot_img

  Trending Stories

  Related Stories