International

పాకిస్తాన్‎కు అగ్రరాజ్యం వార్నింగ్..!

ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం పాకిస్తాన్‎కు అలవాటుగా మారింది. అది ప్రపంచ దేశాలన్నింటికి తెలుసు. అలాంటి పాకిస్తాన్ ను గట్టిగా నిలవరించే ప్రయత్నం భారత్ తప్పా మరే దేశం చేయడం లేదు.

ఏదో మొక్కుబడిగా పాకిస్తాన్ కు వార్నింగ్ లు ఇవ్వడం తప్పా.. గట్టిగా అలాంటి కార్యక్రమాలు మానుకోవాలని హెచ్చరించిన దేశాలు లేవు. ఫలితంగా ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న ఉగ్రవాదులు సామాన్య జనాల ప్రాణాలను తీయడంతో పాటు ఇతర దేశాలకు తీవ్రంగా నష్టాన్ని కలగజేస్తున్నాయి. ముఖ్యంగా భారత్ ను నిత్యం దెబ్బ కొట్టాలని చూసే పాకిస్తాన్ ఉగ్రవాదుల సాయంతో దేశంలో విధ్వంసం సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అలాంటి పాకిస్తాన్ చర్యలనున నిత్యం భారత్ సమర్థంగా ఎదుర్కొంటూ వస్తోంది. తాజాగా అగ్రరాజ్యం కూడా ఉగ్రవాదంపై పాకిస్తాన్ వైఖరిని మార్చుకోవాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

అన్ని ఉగ్రవాద ముఠాలను విచ్చిన్నం చేయడానికి పాకిస్తాన్ గట్టి చర్యలు తీసుకొంటుందని ఆశిస్తున్నట్లు ఆ దేశంలో అమెరికా నూతన రాయబారి డోనాల్డ్ బ్లోమ్ అన్నారు. ఉగ్రవాదంపై పొరుపై పాక్ నిబద్ధత రానున్న కాలంలో అమెరికా పాక్ సంబంధాల తీరును నిర్ణయిస్తుందన్నారు. ఉగ్రవాదంపై సమర్థంగా పోరాడటానికి మిత్రదేశాలతో అమెరికా చేతులు కలుపుతుందని బ్లోమ్ తెలిపారు. ఉగ్రవాదులు విదేశాల్లో దాడులు చేయడానికి ఆఫ్గానిస్తాన్ గడ్డను ఉపయోగించుకోకుండా అక్కడి తాలిబన్ ప్రభుత్వంపై పాక్ తో కలిసి ఒత్తిడి పెంచుతామని తెలిపారు. డాన్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా కుట్ర వల్లే తనను ప్రధాని పదవి నుంచి తొలగించారని ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణల గురించి ప్రశ్నించగా.. దాని గురించి పట్టించుకోకుండా ముందుకు సాగుదని బ్లోమ్ సూచించారు. గడచిన 75 ఏళ్ల నుంచి చేస్తున్నట్లు రెండు దేశాలూ అన్ని స్థాయిలో సంబంధాలను పటిష్టపరచుకోవాలన్నారు. ఇక నుంచి అనేక మంది అమెరికన్ ప్రముఖులు పాక్ ను సందర్శిస్తారని బ్లోమ్ చెప్పారు. ఉగ్రవాదులకు నిధుల ప్రవాహాన్ని నిరోధించడానికీ, అక్రమ ధనాన్ని చట్టబద్ద రూపంలో మార్చే కార్యకలాపాలను రూపుమాపడానికి పాక్ చేస్తున్న కృషిని బ్లోమ్ అభినందించారు.

మరోవైపు భారత వైమానిక దళాలు ఎల్వోసీ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు జరపటంతో అధిక సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఈ దాడుల వల్ల 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు అంచనా వేస్తున్నారు. జైషే ఉగ్రవాద సంస్థకు చెందిని బాల్కోట్‌ ఉగ్రవాద శిబిరం దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది నేలమట్టం అయిందంటే మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండవచ్చని భావిస్తున్నారు. మరోవైపు తమకు ఎలాంటి నష్టం జరుగలేదని పాక్‌ బుకాయిస్తోంది. భారత వైమానిక బృందం మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలు ఉన్న లేజర్‌ గైడెడ్‌ బాంబులతో ఉగ్రక్యాంపులను ధ్వంసం చేసింది. 12 మిరాజ్‌-2000 జైట్‌ ఫైటర్స్‌తో ఈ దాడి చేపట్టారు. ఈ నేపథ్యంలో భారత్‌, పాక్‌ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

six − five =

Back to top button