More

    స్పష్టం చేసేసిన అమెరికా.. భారత్ ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు

    భారత్ కు చెందిన చమురు కంపెనీలు రష్యాతో డీల్ కుదుర్చుకోవడంపై కొందరు అనవసర రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే..! ముఖ్యంగా అమెరికా కన్నెర్ర జేసిందంటూ పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం అయ్యాయి. రష్యాపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో రష్యా నుంచి భారత దేశం క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుని భారత్ ఆంక్షలను ఉల్లంఘించిందని ఆరోపించారు. అయితే భారత్ చేసిన పని ఆంక్షలను ఉల్లంఘించడం క్రిందకు రాదని అమెరికా స్పష్టం చేసింది. ఈ దిగుమతులు ప్రస్తుతానికి భారత్ దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురులో 1 నుంచి 2 శాతం వరకు మాత్రమే ఉన్నందువల్ల ఆంక్షలను ఉల్లంఘించినట్లు పరిగణించడం లేదని తెలిపింది.

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వర్చువల్ సమావేశం అనంతరం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ మాట్లాడుతూ.. రష్యా నుంచి భారత్ కేవలం 1 నుంచి 2 శాతం చమురును మాత్రమే దిగుమతి చేసుకుంటోందని, అందువల్ల రష్యాపై విధించిన ఆంక్షలను భారత్ ఉల్లంఘించినట్లు పరిగణించడం లేదని అన్నారు. రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న చమురు కన్నా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు చాలా ఎక్కువ అని తెలిపారు. రష్యా నుంచి చమురు దిగుమతులను పెంచుకోవడం భారత దేశ ప్రయోజనాలకు సరికాదని మోదీకి బైడెన్ చెప్పారన్నారు. ఇంధనం దిగుమతులను నిషేధించలేదని.. తాము విధించిన ఆంక్షలను భారత్ ఉల్లంఘించలేదన్నారు. ప్రతి దేశం తన ప్రయోజనాల కోసం అడుగులు వేస్తుందనే విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. భారత్ చమురును దిగుమతి చేసుకునేందుకు అవకాశాలను పెంచడానికి అమెరికా సిద్ధంగా ఉందని మోదీకి బైడెన్ కూడా చెప్పినట్లు ఆమె తెలిపారు.

    Trending Stories

    Related Stories