More

    పేపర్ ప్లేట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించడం తప్పు: పవన్ కళ్యాణ్

    రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఫొటోలను కాగితం ప్లేట్లపై ముద్రించి ఉండటాన్ని చూసి ప్రశ్నించిన గోపాలపురం ఎస్సీ యువకులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసులు నమోదు చేయడం సరికాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాగితం ప్లేట్లపై అంబేద్కర్ ఫొటోలను చూసి నిరసన వ్యక్తం చేసిన 18 మంది ఎస్సీ యువకులపై నేరపూరిత కుట్రను ఆపాదిస్తూ కేసు నమోదు చేయడం ద్వారా సమస్యను మరింత తీవ్రతరం చేశారని ఆయన విమర్శించారు. ఇలాంటి సున్నితమైన వ్యవహారాల్లో పోలీసు అధికారులు సామరస్య ధోరణితో వ్యవహరించాలని పవన్ అన్నారు. ప్రజల మధ్య దూరం పెరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులతో పాటు అన్ని పార్టీలపైనా ఉందని చెప్పారు. పేపర్ ప్లేట్లపై ఆ మహానీయుడి ఫొటో ముద్రించడం తప్పు అని జనసేనాని వ్యాఖ్యానించారు. దీనిని ప్రశ్నించిన గోపాలపురం యువకులపై కేసులు నమోదు చేయడం సరికాదని అన్నారు.

    కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో అంబేద్కర్ ఫోటోలు ఉన్న పేపర్ ప్లేట్లలో ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. అంబేద్కర్ ఫోటో ముద్రించి అదే ప్లేట్స్ లో ఫాస్ట్ ఫుడ్ సరఫరా చేయడం గమనించిన పలువురు హోటల్ వద్ద ఘర్షణకు దిగారు. ఈ విషయం పోలీసుల దృష్టికి చేరుకోవడంతో హోటల్ యజమాని సహా ప్లేట్లు సరఫరా చేసిన వ్యాపారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌కు అవమానం జరిగిందంటూ వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టేలా ప్రచారాలు చేసిన 18 మంది యువకులపై రావులపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.

    spot_img

    Trending Stories

    Related Stories