More

    ఆ యాత్రపైనా.. హరీష్ రావుపైనా.. మంత్రి అంబటి ఘాటు వ్యాఖ్యలు

    అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. కోటీశ్వరులు కొవ్వెక్కి పాదయాత్ర చేస్తున్నారని అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అమరావతి రాజధాని రైతులు దేవుణ్ని అడ్డం పెట్టుకుని పాదయాత్రల పేరిట నాటకాలు ఆడుతున్నారని.. విజయవాడలోని దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ విధానం వికేంద్రీకరణకు కట్టుబడి ఉందని.. కేవలం రాష్ట్రంలోనే కాదు పంచాయతీల్లోనూ తమ పాలసీ కొనసాగుతుందని అన్నారు. సామాన్యుడికి పరిపాలన అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల నిర్ణయానికి పాల్పడితే ప్రతిపక్ష టీడీపీ నాయకులు రైతుల ముసుగులో అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కడుపు మండిన వారు పాదయాత్ర చేస్తే చంద్రబాబు బాధ్యత వహించాలని హెచ్చరించారు. పోలవరం సర్వనాశనం అయిపోవాలని చంద్రబాబు కోరికగా ఉందని.. రాష్ట్రం శ్రీలంకలా అయిపోవాలని కోరుకుంటున్నారని.. రాష్ట్రం ఏమైనా తమ తాబేదార్లు ఉన్న అమరావతి మాత్రం దేదీప్యమానంగా వెలిగి పోవాలనేది చంద్రబాబు ఆలోచన అని అన్నారు.

    తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్లు వేశారు. ఏపీ గురించి మాట్లాడే నైతిక హక్కు -అర్హత తెలంగాణ మంత్రి హరీష్ రావుకు లేదన్నారు. తమ రాష్ట్రంలో బలహీన పడి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయాలు తక్కువగా ఉన్నా అద్భుతంగా సంక్షేమ పథకాలు ఏపీలో అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం పై చర్చకు హరీష్ రావు సిద్ధమా అంటూ అంబటి సవాల్ చేసారు.

    Trending Stories

    Related Stories