కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అమర్‌నాథ్ యాత్ర వరుసగా రెండవసారి రద్దు చేయబడింది. ఆలయం జూన్ 28 నుండి భక్తుల కోసం ఆన్‌లైన్ లో దర్శనం ఇవ్వనుంది. అమర్‌నాథ్ ఆలయం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్‌లోని హిమాలయాలలో ఒక గుహలో 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న శివాలయం. హిందూ మతంలో పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి మరియు 51 శక్తిపీఠాలలో ఒకటి. చైనా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 లో తీర్థయాత్ర రద్దు చేయబడింది. ఈ ఏడాది కూడా మరోసారి యాత్రను రద్దు చేశారు.
అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రవాద దాడికి బెదిరిస్తున్న సోషల్ మీడియా సందేశాలు వైరల్ కావడంతో గత వారం ఏజెన్సీలు యాత్రకు భద్రతను పెంచాయి. హిందువులకు పవిత్ర తీర్థయాత్ర అమర్ నాథ్ యాత్ర ను గతంలో చాలాసార్లు ఉగ్రవాదులు టార్గెట్ చేశారు.
జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జూన్ 21 న వార్షిక అమర్‌నాథ్ తీర్థయాత్రను వరుసగా రెండో సంవత్సరం రద్దు చేసినట్లు ప్రకటించారు. భక్తులు ఈ పవిత్ర స్థలాలకు వర్చువల్ గా చూడొచ్చు. చార్ ధామ్ యాత్ర నుండి వైష్ణో దేవి వరకు పవిత్ర మందిరంలో చేసే ఆచారాలన్నీ ఆన్‌లైన్‌లో ప్రసారం చేయబడతాయి. 56 రోజుల అమర్‌నాథ్ యాత్ర జూన్ 28 నుండి రెండు మార్గాల్లో ఒకేసారి ప్రారంభమై ఆగస్టు 22 న రక్షా బంధన్‌తో ముగుస్తుంది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేస్తూ “ప్రజల ప్రాణాలను కాపాడటం చాలా ముఖ్యం. కాబట్టి ఈ సంవత్సరం తీర్థయాత్ర నిర్వహించడం మంచిది కాదు. ” అని అమర్ నాథ్ యాత్ర రద్దుపై ప్రకటన చేసింది.