National

ఫ్యాక్ట్ చెక్‎కు పనిష్మెంట్..! ఆల్డ్ న్యూస్ జుబేర్ అరెస్ట్..!!

ఫ్యాక్ట్ చెక్ పేరుతో దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్న జర్నలిస్ట్ జుబేర్‎కు ఢిల్లీ పోలీసులు చెక్ పెట్టారు. ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్‌ “ఆల్ట్‌ న్యూస్‌”సహ వ్యవస్థాపకుడు జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

ఓ మతానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీశారని, శత్రుత్వాన్ని ప్రేరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఐపిసి సెక్షన్లు 153, 295 కింద మహ్మద్ జుబైర్‌ను అరెస్టు చేశారు. జుబైర్ పై పలు సెక్షన్ల కింద నమోదైన కేసుకు సంబంధించి దర్యాప్తునకు పిలిచామని… తగిన సాక్ష్యాలు ఉన్నందున అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జుబైర్‌ అరెస్ట్‌ను ఆల్ట్‌ న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్‌ సిన్హా ధ్రువీకరించారు. 2020 నాటి కేసుకు సంబంధించి జుబైర్‌ను దిల్లీ పోలీసులు ప్రశ్నించడానికి పిలిచారని, అయితే ఈ కేసు విషయంలో ఎలాంటి అరెస్టు చేయొద్దని హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆల్ట్‌న్యూస్ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా ట్వీట్ చేశారు. అయితే, జుబైర్‌ వేరే ఎఫ్‌ఐఆర్‌లలో అరెస్టు చేశారని.. ఆయా సెక్షన్‌ల పరిధిలో ఆయనకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వలేదని… పదేపదే అభ్యర్థించినప్పటికీ తమకు ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వడం లేదని సిన్హా ట్వీట్ చేశారు.

వైద్య పరీక్షల అనంతరం జుబేర్‌ను గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారని సిన్హా తెలిపారు. ఎక్కడికి అనేది జుబేర్‌ లాయర్‌కి గానీ, తనకు గానీ చెప్పలేదన్నారు. తాము ఇద్దరం పోలీసు వ్యాన్‌లో వున్నామని… కానీ ఏ పోలీసుకు కూడా పేరు తెలియజేసే ట్యాగ్‌లేవీ లేవన్నారు. ఐపిసిలోని సెక్షన్‌ 153 కింద జుబేర్‌ను అరెస్టు చేశారు. తదుపరి పోలీసు కస్టడీ కోసం డ్యూటీ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరుస్తున్నట్లు పోలీసులు చెప్పారు. జుబేర్ అరెస్ట్‌పై టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ స్పందిస్తూ.. బీజేపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఫేక్‌ వార్తలను ప్రతిరోజూ బయటపెడుతున్న ప్రపంచంలోనే అత్యుత్తమ జర్నలిస్టులలో ఒకరైన మహమ్మద్ జుబైర్‌ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా అధికారులను ప్రజల కోసం ఉపయోగించాలని.. ఇలాంటి వాళ్లపై కాదని హితవు పలికారు. నిజంగా మీరు పిరికివారని అని డెరెక్‌ ఒబ్రెయిన్ విమర్శించారు.

ఈ నెల ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లోని ఖైరాబాద్ పోలీస్ స్టేషన్‌లో మహమ్మద్ జుబైర్‌పై ముగ్గురు హిందూ దార్శనికులైన యతి నరసింహానంద సరస్వతి, బజరంగ్ ముని, ఆనంద్ స్వరూప్‌ను “ద్వేషపూరిత ప్రేరేపకులు” అని పిలిచినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ అంశంపై అప్పట్లో జుబేర్‌ను యుపి పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు ఐపిసిలోని 295ఎ కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత భారతీయ వార్తా ఛానెళ్లలో ప్రైమ్ టైమ్ చర్చలు ఇతర మతాల గురించి చెడుగా మాట్లాడే విద్వేషపూరిత ప్రచారకులను ప్రోత్సహించడానికి ఒక వేదికగా మారాయని మే 27న జుబైర్ ట్వీట్ చేశాడు. న్యూస్ స్టూడియోస్ నుంచి చాలా మంచిగా పని చేయగల యాంకర్లు ఇప్పటికే మనకు ఉన్నప్పుడు, ఒక సమాజానికి, మతానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ధరమ్ సన్సద్ ఏర్పాటు చేయడానికి యతి నరసింహానంద సరస్వతి లేదా మహంత్ బజరంగ్ ముని లేదా ఆనంద్ స్వరూప్ వంటి ద్వేషపూరిత వ్యక్తులు మనకు అవసరమా” అని జుబైర్ ట్వీట్ చేశారు. దీనిపై కూడా ఐపిసిలోని సెక్షన్‌ 153 కింద పోలీసులు కేసు నమోదు చేసి మరోసారి జుబేర్ ను అరెస్ట్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

12 + 20 =

Back to top button