More

    ఎట్టకేలకు బెయిల్ దక్కించుకున్న ఆల్ట్ న్యూస్ జుబేర్

    ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో తనపై నమోదైన కేసులో ఉపశమనం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. హిందువుల గురించి జుబైర్ పోస్ట్ చేసిన ట్వీట్‌పై బెయిల్ ఇవ్వడానికి సీతాపూర్‌లోని కోర్టు తిరస్కరించడంతో జుబైర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఇందిరా బెనర్జీ, యుపి ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసు జారీ చేస్తూ, షరతులతో జుబైర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మధ్యంతర బెయిల్ ఆర్డర్‌లోని నిబంధనల ప్రకారం, జుబైర్ అధికార పరిధి నుండి బయటకు వెళ్లవద్దని.. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే వరకు ట్వీట్లు చేయవద్దని ఆదేశించారు. మధ్యంతర ఉత్తర్వులను సోమవారానికి వాయిదా వేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించగా, కోర్టు దానిని అంగీకరించలేదు.

    spot_img

    Trending Stories

    Related Stories