తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో అల్లు శిరీష్, దేవదాయశాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన అల్లు శిరీష్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని మూడు సంవత్సరాలుగా దర్శించుకోలేకపోయాయని, కరోనా తరువాత మొదటిసారి స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఊర్వశివో రాక్షశివో చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా స్వామి వారి ఆశీస్సులు అందుకున్నట్లు అల్లు శిరీష్ చెప్పారు.