More

  బిపిన్ రావత్ మరణంతో..
  మతోన్మాదుల రాక్షసానందం

  ఆయన అచంచలమైన దేశభక్తి యువతరానికి, సైనిక దళాలకు నిరంతర స్ఫూర్తి. బతికినన్నాళ్లు దేశమే దేహంగా జీవించాడు. సైన్యమే సర్వస్వంగా భావించాడు. దేశభద్రతే ధ్యేయంగా ఆయన జీవన ప్రయాణం సాగింది. ఒంటిపై మిల్ట్రీ యూనిఫామ్ వచ్చినప్పటి నుంచి.. చివరి క్షణం వరకు దేశం కోసమే పరితపించాడు. చివరికి భావిభారత సైనికుల్లో స్ఫూర్తి నింపేందుకు వెళ్తూ.. హెలికాప్టర్ ప్రమాదంలో తుది శ్వాస విడిచాడు. బిపిన్ రావత్ అకాల మరణంతో యావత్ దేశం శోకసముద్రంలో మునిగిపోయింది. బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్‎తో పాటు.. ఆయన సతీమణి మధులికా రావత్ సహా 13 మంది అసువులుబాశారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కడే వెల్లింగ్టన్ మిలటరీ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.

  బుధవారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రమాదానికి గురయ్యారన్న వార్త క్షణాల్లో దేశం మొత్తం పాకిపోయింది. ఆయన ఎలాగైనా బతికి రావాలని దేశ ప్రజలు దేవుళ్లను ప్రార్థించారు. కానీ, గంటల గడుస్తున్న కొద్దీ కన్నీళ్లతో ఆయన క్షేమం కోసం మొక్కుకున్నారు. కానీ, దేశ ప్రజల ఆశలను అడియాసలు చేస్తూ.. ఆయన తిరిగిరాని లోకాలకు తరలివెళ్లారు. బిపిన్ రావత్ మరణవార్తతో దేశం మొత్తం శోకసముద్రంలో మునిగిపోయింది. కశ్మీర్ టు కన్యాకుమారి దేశ ప్రజలు ఆ మహా సేనాని సేవల్ని గుర్తుచేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ సైనిక అధికారులు, రాయబారులు సైతం.. భారత్‎కు వచ్చి బిపిన్ రావత్‎కు సంతాపం తెలియజేశారు. రావత్‎తో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుని.. కన్నీటిపర్యంతమయ్యారు. దేశంలోనే అత్యున్నత ర్యాంకులు కలిగిన 800 మంది సైనికులు హాజరై మహావీరునికి తుది వీడ్కోలు పలికారు. రక్షణమంత్రి రాజ్‎నాథ్ సింగ్ దగ్గరుండి అంత్యక్రియలను పర్యవేక్షించారు. బిపిన్ రావత్ మరణంతో ఇలా భారతావని మొత్తం బాధాతప్త హృదయంతో కన్నీళ్లను దిగమింగుకుంటూవుంటే.. కొందరు దేశ విద్రోహశక్తులు రాక్షసానందం పొందుతున్నారు.

  భారత్‎లో తిష్టవేసిన పాక్ ‘బి’ టీమ్ బద్మాష్ గాళ్లు, మానవత్వం మరిచిన మతోన్మాదులు భావదారిద్య్రాన్ని బయటపెట్టుకుంటున్నారు. లెఫ్ట్ లిబరల్ కుహనావాదులు, రాజకీయ కురూపులు, మీడియా ముసుగులో దాగిన కొందరు జాతివ్యతిరేక శక్తులు.. బిపిన్ మరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా సాక్షిగా తమ ఉగ్రవాద భావజాలాన్ని బాహాటంగా చాటుకుంటున్నారు. ఓవైపు సైనికవీరుడి అకాల మృతితో.. దేశం మొత్తం విలపిస్తుంటే.. వీళ్లు మాత్రం నవ్వుల ఎమోజీలు, హ్యాపీ మెసేజీలు పోస్టు చేసి తమ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ మట్టిలోనే వుంటూ.. ఇక్కడి తిండి తింటూ.. ఈ మట్టికోసమే బతికిన వీరజవాన్ మరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ మానసిక దివాళాకోరుతనాన్ని, మానవత్వ లేమి ప్రదర్శిస్తున్నారు. ఇలాంటివాళ్లలో ఒక మతానికి చెందిన మతోన్మాదులే ఎక్కువగా వున్నారు.

  ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన ముస్తఫా రియాజ్ పెట్టిన ఈ మెసేజ్ చూడండి. బిపిన్ మరణవార్తను ఆస్వాదిస్తూ.. ఇక మోదీ వంతు అంటూ ట్వీట్ చేశాడు. అయితే, హైదరాబాద్ సైబర్ పోలీసులు రంగంలోకి దిగినవెంటనే.. క్షణాల్లో తన పేరును ‘అన్షుల్ సక్సేనా’ అని మార్చేశాడు. అంతటితో ఆగకుండా తన ప్రొఫైల్ లో ప్రౌడ్ ఇండియన్, ఓం శాంతి, ఆరెస్సెస్, ఉస్మానియా యూనివర్సిటీ అనే పదాలతో నింపేశాడు.

  ఇక ఆసిఫ్ అనే మరో వ్యక్తి, ఇందులో బాధపడాల్సింది ఏముంది.. రావత్ స్థానంలో మరొకరు వస్తారంటూ ట్వీట్ చేశాడు. పైగా తమకు ఇది మినీ ఈద్ లాంటిదని ప్రకటిచాడు. తన ప్రొఫైల్ లో తాను ముస్లింను అని, హిందుత్వ అభిమానిని కాదని రాసుకున్నాడు.

  ఇక నేషనల్ హెరాల్డ్ పేరుతో దేశంలో పనిచేస్తున్న పాకిస్తాన్ ‘బి’ టీమ్, దాని ఎడిటర్ సంజుక్తా బసు.. బిపిన్ రావత్ మరణంపై అభ్యంతరకర రీతిలో ట్వీట్ చేసింది. ఆయన విషాదకరమే కావొచ్చు.. కానీ, కొన్ని రోజుల క్రితం కశ్మీర్‎లో టెర్రరిస్టుల హత్యలను బిపిన్ సమర్థించాడని.. ఉగ్రవాదులైనంత మాత్రాన వారికి ప్రాణాలు కావా..? అంటూ తన ఉగ్రవాద సానుభూతిని చాటుకుంది.

  మరోవైపు బసుతో కలిసి పనిచేస్తున్న ఆష్లిన్ మాథ్యూ అనే నేషనల్ హెరాల్డ్ జర్నలిస్ట్.. దేవుడు తగినశాస్తి చేశాడన్న రీతిలో విషయం కక్కింది. అయితే, ఆమె ట్వీట్ కు పెద్దయెత్తున విమర్శలు రావడంతో వెంటనే తొలగించింది.

  మరో కుహనా సెక్యులర్ వాది, రాహుల్ గాంధీ అభిమాని, కాంగ్రెస్ మీడియా ఏజెంట్, ది వైర్ కాలమిస్ట్ డాక్టర్ ప్రేరణ బక్షి కూడా తన పైత్యాన్ని చాటుకుంది. బిపిన్ రావత్‎ను యుద్దోన్మాదిగా పోల్చింది.

  అశోక్ సింగ్ గార్చా అనే నెటిజన్.. బిపిన్ రావత్, వీకే సింగ్ వంటి ఆర్మీ అధికారులు సైన్యంలో లౌకికతత్వానికి ద్రోహం చేశారని విషం చిమ్మాడు. బిపిన్ రావత్ ను ‘ఇండియన్ ఆర్మీలో సంఘ్ చీఫ్’గా పోల్చాడు.

  ఇక, ఇస్లామిక్ వాదులు, ఖలిస్తానీల పైత్యానికి అంతే లేదు. బిపిన్ రావత్ మరణాన్ని వారంతా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, తోటి ఆర్మీ ఆఫీసర్ కూడా బిపిన్ రావత్ ను విమర్శించడం సగటు భారతీయుడిని ఆవేదనకు గురిచేసింది. ఆయనకేం పోయేకాలమో.. కల్నల్ బల్జిత్ బక్షి అనే రిటైర్డ్ ఆర్మీ అధికారి.. అభ్యంతరకర రీతిలో ట్వీట్ చేసి ఆ వెంటనే తొలగించాడు. సీడీఎస్ బిపిన్ రావత్ పేరును ప్రస్తావించకుండా.. ‘Karma has its own way of dealing with people’ అంటూ పరోక్షంగా బిపన్‎ను టార్గెట్ చేశాడు.

  ఆ తర్వాత, లెఫ్టినెంట్ కల్నల్ అనిల్ దుహూన్ అనే ఆర్మీ అధికారి కూడా సరిగ్గా ఇలాంటి ట్వీటే చేశాడు. ఇలా కొంతమంది దేశ విద్రోహ శక్తులు, కుహనా లౌకికవాదులు.. మరణించిన బిపిన్ రావత్ పైనా విషం చిమ్మారు.

  ఇదిలావుంటే బిపిన్ రావత్ మరణంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నవారిపై కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇలాంటి అనుచిత పోస్టులు చేసిన కొందరిని అరెస్ట్ చేశారు. బిపిన్ రావత్ మరణంపై ఫేస్‌బుక్ పేజీలో అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన గుజరాత్‌ లోని 44 ఏళ్ల వ్యక్తిని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ సెల్ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడు అమ్రేలీ జిల్లాలోని రాజులా తాలూకాకు చెందిన శివాభాయ్ రామ్‎గా గుర్తించినట్లు చెప్పారు. రెండు వర్గాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడని 153-A సెక్షన్ కింద శివభాయ్ రామ్ అదుపులోకి తీసుకున్నారు. మతాన్ని అవమానిస్తున్న కారణంతోనూ 295-A సెక్షన్ కింద కేసు బుక్ చేశారు. శివభాయ్ రామ్ గతంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలతో పోస్టులు చేసినట్లు.. పలు మార్లు అనుచిత పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.

  ఇక, కర్నాటక ప్రభుత్వం ఇలాంటివారిపై ఉక్కుపాదం మోపింది. బిపిన్ రావత్‎పై అవమానకర రీతిలో పోస్టులు పెట్టినవారిని ఉపేక్షించేబోమని చెప్పారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. అలాంటివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు.

  ఏదేమైనా, బిపిన్ రావత్‎పై అనుచిత వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం. భారత తొలి CDSగా బాధ్యతలు తీసుకున్న కొద్దికాలంలోనే.. త్రివిధ దళాలను సమన్వయం చేస్తూ.. భారత సైనిక దళాల్లో ఆత్మస్థయిర్యాన్ని నింపారు. పోరాట స్ఫూర్తిని రగిలించారు. ఓటమి ఎరుగని సైనికుడిగా రావత్ చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. చేతులెత్తి మొక్కాల్సిన అలాంటి దేశభక్తుడి మరణాన్ని కూడా ఎంజాయ్ చేసిన దేశవిద్రోహులు.. మన దేశంలోనే వుండటం.. భరతజాతి చేసుకున్న దురదృష్టం.

  ఇదిలావుంటే, బిపిన్ రావత్ విషాద మరణాన్ని కొందరు సెలబ్రేట్ చేసుకోవడంపై ప్రముఖ మలయాళ దర్శకుడు అలీ అక్బర్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మతోన్మాద చేష్టలకు నిరసనగా.. ఇస్లాంను విడిచిపెడుతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈ విషయాన్ని అలీ అక్బర్ ఫేస్‌బుక్‌లో వెల్లడించాడు, తనకు-తన కుటుంబానికి ఇకపై మతం లేదని తెలిపాడు. సీడీఎస్ బిపిన్ రావత్ మరణాన్ని అపహాస్యం చేసిన ఇస్లాంవాదులను విమర్శిస్తూ.. అలీ అక్బర్ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

  బిపిన్ మృతిపై కూడా కొందరు సంబ‌రాలు చేసుకుంటున్నార‌ని.. దానికి ఆయన తీవ్ర మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలీతో పాటు త‌న భార్య కూడా ఇస్లామ్ మ‌తాన్ని వ‌దిలివేస్తున్న‌ట్లు ఆయన ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇకపై తాను ముస్లింను కాదని.. భారతీయుడిని మాత్రమే అంటూ అక్బ‌ర్ త‌న వీడియోలో చెప్పాడు. అయితే, బిపిన్ మరణం గురించి ఎమోజీలు పెట్టిన వారికి వ్యతిరేకంగా మాట్లాడిన ఐదు నిమిషాల్లో అతని ఫేస్‎బుక్ ఖాతా బ్లాక్ చేయబడింది. దీంతో దర్శకుడు మరో ఖాతా తెరిచి తాను ఇస్లాంను విడిచిపెడుతున్నట్లు ప్రకటించాడు.

  ఇక నుంచి తన పేరు రామ్ సింగ్ అని ప్రకటించారు. కేరళ సంస్కృతికి కట్టుబడి హత్యకు గురైన వ్యక్తి రామసింహన్ అని.. ఇకపై అలీ అక్బర్‌ని రామ్ సింగ్ అని పిలవబడతాడని తెలిపాడు. 1947లో ఇస్లాం నుండి హిందూ మతంలోకి మారినందుకు రామసింహన్, అతని కుటుంబాన్ని ఇస్లాంవాదులు చంపేశారు. రామసింహన్, అతని సోదరుడు దయాసింహం, దయాసింహన్ భార్య కమల, వారి వంట మనిషి రాజు అయ్యర్, ఇతర కుటుంబ సభ్యులను మలప్పురం జిల్లాలోని మలపరంబలో ఇస్లామిక్ జిహాదీలు స్వాతంత్య్రానికి కేవలం రెండు వారాల ముందు 1947 ఆగస్ట్ 2వ తేదీన దారుణంగా నరికి చంపారు.

  అలీ అక్బర్ తన భార్యతో చర్చించిన తర్వాత ఇస్లాంను విడిచిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సీడీఎస్ బిపిన్ రావత్ మరణాన్ని అపహాస్యం చేసిన వ్యక్తుల పేర్లతో కూడిన చిత్రాన్ని కూడా అక్బర్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. అలీ అక్బ‌ర్ మలయాళంలో హిట్ సినిమాలకు పనిచేశారు. డజనుకుగా పైగా సినిమాలకు రచయితగా పనిచేసిన అలీ ప్రస్తుతం దర్శకుడిగా మారి.. 1921లో జ‌రిగిన మ‌లాబార్ ఉద్య‌మంపై ప్రస్తుతం సినిమాను తీస్తున్నారు. ఆయనకు గతంలో నేషనల్ అవార్డు కూడా వచ్చింది. మొత్తానికి, అలీ అక్బర్ తన పేరును రామ్‎సింగ్‎గా మార్చుకుని ఇస్లాం నుంచి బయటికి వచ్చి.. బిపిన్‎ను విమర్శిస్తున్న ఉన్మాదులకు బుద్ధి చెప్పారు.

  Trending Stories

  Related Stories