కర్మభూమి, పుణ్యభూమి, ధన్యభూమి.. మన మాతృభూమి. ఇంతటి విశిష్ట జన్మభూమి మన భరతభూమి. ఈ బంగారు భూమి పాడి పంటలతో, పసిడి రాసులతో, సిరి సంపదలతో కళకళలాడే పవిత్ర జనని. ఆప్యాయతానురాగాల ఈ సువర్ణ గనిలో.. ఎందరో ఘనులైన భరతమాత ముద్దు బిడ్డలు ఉన్నారు. మన పుణ్యజనని గొప్పతనాన్ని విశిష్టరీతలో విశ్వానికి తెలియజేసిన మహోన్నతులు ఎందరో వున్నారు. నిన్న, నేడు, రేపు.. అనే బేధం లేకుండా.. ఎప్పుడు మహనీయుల వాక్కులతో పుణ్యభూమి గొప్పదనం విశదం అవుతూనే వుంది. తాజాగా.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్ భగవత్.. భరతజాతి ఔన్నత్యాన్ని, భారతీయ విశిష్టతను..తమదైన శైలిలో మరొక్కసారి చాటిచెప్పారు. భారతావనిని మాతృభూమిగా భావించే.. యావత్ దేశంలోని ప్రజలందరూ మతాలకు అతీతంగా హిందువులే అని RSS సర్ సంఘ్ చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్ సుర్జుగా అంబికాపూర్‌లో బహిరంగ సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేసే ముందు మన నేషనలిస్ట్ హబ్ ఛానెల్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోండి. దేశం కోసం అహర్నిశలూ శ్రమిస్తూ.. ఎప్పటికప్పుడు విలువైన సమాచారాన్ని చేరవేస్తున్న నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకోవడమే కాక, బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి మమల్ని మరింతగా ప్రోత్సహించండి. ఇక విషయంలోకి వెళ్దాం.
భారతదేశంలోని ప్రజలందరూ హిందువులని, మతాలకు అతీతంగా భారతదేశాన్ని తన మాతృభూమిగా భావించే వారందరూ హిందువులేనని డాక్టర్ మోహన్ భగవత్ విస్పష్టంగా తెలియజేశారు. ఎవరు ఏ మతాన్ని అనుసరించినా, ఎవరు ఏ రకమైన వస్త్రాలు ధరించినా..ఏ ఆచార వ్యవహారాలు పాటించినా, ఏ సంప్రదాయాలు ఆచరించినా.. భారత దేశాన్ని మాతృభూమిగా భావించే ప్రతి ఒక్కరూ హిందువే అన్నారు.
కులం, మతం, ఆహారపు అలవాట్లు ఏవైనా భారత్‌లో నివసిస్తున్న వారందరూ హిందువులేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. RSS 1925 నుంచి ఇదే స్పష్టం చేస్తోందని ఆయన చెప్పారు. ప్రజల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించడమే హిందూత్వ సిద్ధాంతమని అన్నారు. 40 వేల సంవత్సరాల క్రితం అఖండ భారత్‌లో భాగమైన అందరి డీఎన్ఏ ఒక్కటేనని పేర్కొన్నారు. వందల సంవత్సరాలుగా మనం ఐక్యం ఉండడమే ఈ సత్యాన్ని వెల్లడిస్తోందని ఆయన చెప్పారు.
ప్రతి ఒక్కరు తమ సంస్కృతి సంప్రదాయాలను పాటించాలని పూర్వీకులు మనకు చెప్పారని డాక్టర్ భగవత్ తెలిపారు. ఇతరుల విశ్వాసాలు, సంప్రదాయాలను మనమంతా గౌరవించాలని అన్నారు. సొంత లాభాల కోసం, సొంత లక్ష్యాల కోసం పరుల సంపదను దోచుకోవాలని తపన పడడం తగదని తెలిపారు. కరోనా మహమ్మారి వికటాట్టహాసం చేస్తున్న సమయంలో దేశమంతా ఏకతాటిపై నిలిచి కలిసికట్టుగా పోరాటం చేసిన విషయాన్ని భగవత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మన మధ్య వ్యత్యాసాలు ఎన్ని వున్నా, క్లిష్ట పరిస్థితుల్లో ఒక్కటిగా నిలిచి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని భగవత్ పేర్కొన్నారు.
చిన్న మనస్తత్వం వున్నవారే తమలో తాము కలహించుకుంటారని, అయితే, భారతావనిలో అందరూ పెద్దమనస్సు కలవారే అని..ఎన్నో విపత్కర సమయాల్లో ఇది రూఢీ అయ్యిందని ఆయన చెప్పారు. రాజులు, రాచరికాలు, పాలకులు, ప్రభుత్వాలు మారినా భారతావని చెక్కు చెదరకుండా..అలాగే వుందని అన్నారు. రాష్ట్రీయ స్వయక్ సేవక్ సంఘ్ కు సర్వజన సంక్షేమమే ప్రధానమని, సంఘ్ కు స్వప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. అందరి శ్రేయస్సు కాంక్షించే RSS.. ఎప్పుడూ తన వ్యక్తిగత గొప్పదనాన్ని చాటుకోదని, ఆదరణాభిమానాలు వాంఛించదని చెప్పారు.
అంబికాపూర్‌లో బహిరంగ సభలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సా, ప్రతిపక్ష నేత నారాయణ్ చందేల్, రాయ్‌పూర్ సౌత్ ఎమ్మెల్యే బ్రిజ్మోహన్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మోహన్ భగవత్ తో పాటు పలువురు నేతలు భగవాన్ బిర్సా ముండే కు నివాళులర్పించారు. వనవాసీ వర్గాలకు చెందిన రాజకీయ నాయకుడు కుమార్ దిలీప్ సింగ్ జూదేవో విగ్రహాన్ని డాక్టర్ భగవత్ ఆవిష్కరించారు. అనంతరం, మోహన్ భగవత్ ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవో నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు.