More

    అలయ్-బలయ్ అదుర్స్

    పండుగ అంటే చాలు.. అందరూ ఒక చోట కలిసి ఆనందంగా ఉండటం. యోగక్షేమాలు తెలుసుకోవడం. ఈ ఉద్దేశంతోనే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొన్నేళ్లుగా అలయ్, బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె విజయలక్ష్మి ఉత్సాహంగా నిర్వహించారు.

    తెలంగాణ సంస్కృతిలో భాగం ‘అలయ్‌ బలయ్‌’. విజయదశమి తర్వాత రోజు బంధుమిత్రులను కలుసుకున్న సందర్భంగా పరస్పర ఆత్మీయాభిమానాలతో.. ఆలింగనం చేసుకుంటూ ‘అలయ్ బలయ్’ చెప్పుకుంటారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వానికి అద్దం పట్టేలా జరిగే ఈ కార్యక్రమాన్ని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ప్రతి ఏటా గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. 2005లో అలయ్-బలయ్ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ మొదలుపెట్టారు. అలయ్ బలయ్ ఫౌండేషన్ కు దత్తాత్రేయ కూమార్తె విజయలక్ష్మి ఛైర్మన్ గా వ్యవరిస్తున్నారు.

    దసరా సమ్మేళనం-2022లో భాగంగా ఈ ఏడాది హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌లో నిర్వహించిన అలయ్ బలయ్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది. రాజకీయాలకు అతీతంగా జరిగిన కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు, మాజీ ఎంపీ వీహెచ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు విజయలక్ష్మి ఘన స్వాగతం పలికారు.

    అలయ్ బలయ్ కు విస్తృత ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి దత్తాత్రేయ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సాధారణంగా విద్య, వైద్యం. వైజ్ఙానికి కార్యక్రమాలు ఉంటాయని.. కానీ ప్రేమ, సౌభ్రాతృత్వం పంచే అద్భుతం అలయ్-బలయ్ అని కొనియాడారు. ఇది దేశవ్యాప్తంగా జరగాలని ఆకాంక్షించారు. గత 17 ఏళ్లుగా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని విజయలక్ష్మి చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో దత్తాత్రేయ, చిరంజీవి డప్పు కొడుతూ అందర్ని ఉత్సాహ పరిచారు.

    Trending Stories

    Related Stories