అక్షయ్ కుమార్ కు మాతృవియోగం..!

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తల్లి మరణించారు.అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆమె కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు ముంబయిలోని హీరానందిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తల్లి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్షయ్ కుమార్ కొన్నిరోజుల కిందట లండన్ నుంచి వచ్చేశారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఎప్పటికప్పుడు ట్వీట్ల ద్వారా చెబుతూ వస్తున్నారు. తన తల్లి విషమపరిస్థితిలో ఉందని, ఈ సమయంలో అభిమానుల ప్రార్థనలు తమకు ఎంతో అవసరమని అక్షయ్ కుమార్ భావోద్వేగభరితమైన పోస్టు చేశారు.
చికిత్స పొందుతూ అరుణా భాటియా నేటి ఉదయం ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. దాంతో అక్షయ్ కుమార్ తీవ్ర విషాదానికి లోనయ్యారు. ఈ వేదన భరింపరానిది అంటూ సోషల్ మీడియాలో స్పందించారు. “నాకు సర్వం మా అమ్మే. ఇవాళ ఆమె కన్నుమూసింది. మరో లోకంలో ఉన్న మా నాన్నను తిరిగి కలిసేందుకు వెళ్లిపోయింది. మా అమ్మ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు… ఓంశాంతి” అంటూ పేర్కొన్నారు.
సోమవారం నాడు అక్షయ్ కుమార్ అనారోగ్యంతో ఉన్న తల్లి అరుణ భాటియాను చూడడానికి లండన్ నుండి ముంబైకి తిరిగి వచ్చారు. ‘సిండ్రెల్లా’ షూటింగ్ కోసం అక్షయ్ కుమార్ లండన్ లో ఉండగా తల్లి ఆరోగ్య పరిస్థితి కారణంగా ముంబైకు తిరిగి వెళ్లిపోవాలని అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నాడు. అక్షయ్ తల్లి మరణించినందుకు అభిమానులు, స్నేహితులు మరియు చిత్ర పరిశ్రమకు చెందిన వాళ్లు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.