మహారాష్ట్రలో రైలుకింద పడబోయిన వృద్దురాలిని ఓ రైల్వే పోలీసు చాకచక్యంగా కాపాడాడు. కదులుతున్న రైలు ఎక్కబోతుండగా వృద్దురాలు కాలు జారి పట్టాల కింద పడబోయింది. దీంతో గమనించిన రైల్వే కానిస్టేబుల్ ఆమెను పట్టాలపై పడకుండా పట్టుకున్నాడు. ఈ ఘటన నాగ్పూర్-ముంబై లైన్లోని అకోలా స్టేషన్లో జరిగింది. వృద్దురాలిని రక్షించిన కానిస్టేబుల్ను రైల్వే ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.