అఖిలేష్ యాదవ్ పై నిప్పులు చెరిగిన అసదుద్దీన్

0
787

ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీని ఓడించే సత్తా సమాజ్‌వాది పార్టీకి లేదని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. మైనార్టీలు అలాంటి అసమర్థ పార్టీకి ఓటు వేయకూడదని పిలుపునిచ్చారు. యూపీలోని రెండు లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుందని.. యూపీలో బలపడేందుకు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. బీజేపీకి ఎంఐఎం టీమ్ మద్దతు ఇస్తోందని సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపించాయన్నారు. మైనార్టీ ఓట్లు చీలిపోతే బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు చెప్పారని, కానీ ఈ గెలుపుకు ఎవరు బాధ్యులని ఆయన ప్రశ్నించారు. అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం అఖిలేష్ యాదవ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఓటములకు అఖిలేష్ యాదవ్ అహంకారమే కారణమని ఆరోపించారు.

“అఖిలేష్ యాదవ్ చాలా అహంకారి, అతని తండ్రి (యుపి మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్) ఆ స్థానం నుండి పార్లమెంటు సభ్యుడు. అప్పుడు అతను ఎన్నికయ్యాడు. అతను ఆ స్థానం నుండి ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు చెప్పడానికి కూడా అక్కడికి వెళ్లడు.” అని విమర్శించారు అసదుద్దీన్. బీజేపీని ఓడించే సత్తా సమాజ్‌వాదీ పార్టీలో లేదని ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాలు చూపిస్తున్నాయని అన్నారు.అలాంటి అసమర్థ పార్టీలకు మైనారిటీ వర్గాలు ఓట్లు వేయకూడదని అన్నారు. అఖిలేష్ యాదవ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకత్వాన్ని ఎంచుకుని, లోక్‌సభ స్థానానికి రాజీనామా చేసిన కొన్ని నెలల తర్వాత అజంగఢ్‌లో ఉప ఎన్నికలు జరిగాయి. రాంపూర్ సీటు ఎస్పీ నాయకుడు అజం ఖాన్‌కు కంచుకోటగా ఉంది. ఆయన పలు కేసుల్లో బుక్ అయ్యాడు.

అజంగఢ్, రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించడంతో ఆ రెండు స్థానాలను అధికార బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో సమాజ్‌వాదీ పార్టీ చేతిలో ఉన్న రెండు లోక్‌సభ స్థానాలు బీజేపీకి కైవసం కావడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నెలకొంది. భోజ్‌పురి నటుడు-గాయకుడు బీజేపీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్ ‘నిరాహువా’ అజంగఢ్ స్థానంలో గెలుపొందగా, మరో బీజేపీ అభ్యర్థి ఘనశ్యామ్ లోధి సమాజ్‌వాదీ పార్టీ నుండి రాంపూర్ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ విజయానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అజంగఢ్, రాంపూర్ ఉప ఎన్నికల విజయాలు చారిత్రాత్మకమైనవని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ.