కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఛాన్స్ లేదని తేల్చేసిన అఖిలేష్ యాదవ్

0
668

కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎన్నికలు ఏవైనా.. ఓటములు మాత్రం పలకరిస్తూనే ఉన్నాయి. ఇక ఎన్నో పార్టీలు కాంగ్రెస్ తో దోస్తీకి కటాఫ్ చెప్పేశాయి. ఇక కొత్తగా ఏ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం రెడీ అవ్వడం లేదు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఎవరు పెట్టుకునే అవకాశం ఉందో.. అందుకు తగ్గ ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీ మరోసారి కాంగ్రెస్ చెంత చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ కథనాలపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ స్పందించారు.

కాంగ్రెస్ పార్టీతో పొత్తు అవకాశమే లేదని తాజాగా మీడియాతో వెల్లడించారు ఆయన. 2022లో జరగనున్న ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని.. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తోనూ పొత్తు ఉండదని అన్నారు. వారితో జట్టుకట్టే అవకాశాలు లేవని తెలిపారు. అయితే పెద్ద పార్టీలతో పొత్తు ఉండదని.. చిన్న పార్టీలతోనే కలసి ముందుకు వెళతామని ఆయన వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ప్రణాళికపై అఖిలేష్ యాదవ్ బీఎస్పీ, కాంగ్రెస్‌తో పొత్తును తోసిపుచ్చారు. “సమాజ్ వాదీ పార్టీ పెద్ద పార్టీలతో ఎలాంటి పొత్తు పెట్టుకోదు. మేము చిన్న పార్టీలతో కలిసి ఎన్నికల్లో వెళ్తాము ”అని అఖిలేష్ యాదవ్ క్లారిటీతో చెప్పారు. శివపాల్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్న జస్వంత్ నగర్ సీటు నుండి పార్టీ పోటీ చేయబోవడం లేదని తేల్చి చెప్పారు.

బీజేపీ పాలనతో ప్రజలు విసుగెత్తారని, అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. ప్రతి విషయంలోనూ యోగి సర్కార్ విఫలమైందని.. ద్రవ్యోల్బణంతో ధరలు భారీగా పెరిగాయని, రైతులు, ప్రజలు ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని అన్నారు. ప్రజలు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు అతి సమీపంలోని ఉన్నాయని హెచ్చరించారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో దయనీయ పరిస్థితులు తలెత్తాయని అంతా దేవుడిపైనే భారం వేయాల్సి వచ్చిందని అన్నారు. కరోనా కట్టడిలో యోగి సర్కారు విఫలమైందని అన్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here