More

    దేశంలో మరో కొత్త ఫ్రంట్.. ఒక్కటైన దీదీ, అఖిలేష్..!

    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ దేశంలో కొత్త ఫ్రంట్ ను తీసుకుని రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వీరిద్దరి సమావేశంపై కొనసాగిన సస్పెన్స్ ఎట్టకేలకు వీడింది. వీరు సమావేశమై కాంగ్రెస్, బీజేపీయేతర కూటమిని దేశంలో తీసుకుని రావాలని భావించారని.. అందులో భాగంగానే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ ప్రతిపక్షంలో ఏ మాత్రం సత్తా లేని నాయకుడిగా మారాయని.. బీజేపీ రాహుల్ గాంధీని ప్రతిపక్షాల ప్రతినిధిగా వాడుకోవాలని చూస్తోందని తృణమూల్ ఆరోపిస్తోంది. అఖిలేశ్‌తో మాట్లాడిన మమత ఈ నెల 23న ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌తో సమావేశం కానున్నారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా ప్రాంతీయ పార్టీలకు ఉందని మమత భావిస్తూ ఉన్నారు.

    అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ తాము దీదీ తోనే ఉన్నామని.. బీజేపీ, కాంగ్రెస్‌లకు తాము సమదూరం పాటించాలని నిర్ణయించినట్టు చెప్పారు. బీజేపీ వ్యాక్సిన్ తీసుకున్న వారికి సీబీఐ, ఈడీ, ఐటీలతో ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. బెంగాల్‌లో బీజేపీని ఓడించగా లేనిది.. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఎందుకు ఓడించలేమని అఖిలేష్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి బీజేపీని తరిమి కొట్టడమే తమ ధ్యేయమని అన్నారు. దీదీ బెంగాల్‌లో పోరాడుతున్నారని., తాము యుపిలో పోరాడుతున్నామన్నారు. తమ పార్టీ దీదీతో ఉందని అన్నారు. మమత శుక్రవారం నాడు తన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ పార్టీ బీజేపీ లేదా కాంగ్రెస్ వైపు చూడటం లేదని, ప్రాంతీయ పార్టీలను కలుపుకుని పోవడానికే ప్రయత్నిస్తామని చెప్పారు.

    Trending Stories

    Related Stories