National

సంచలన నిర్ణయం తీసుకున్న అఖిలేష్ యాదవ్

సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉపఎన్నికల్లో ఓటమి తర్వాత అన్ని పార్టీ యూనిట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలు యువత, మహిళలతో సహా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎస్పీ రాష్ట్ర యూనిట్ చీఫ్ గా మాత్రం నరేష్ ఉత్తమ్ కొనసాగుతారని వెల్లడించారు. ఈ మేరకు పార్టీ అధికారిక ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. అధికారికంగా ఎటువంటి కారణం చెప్పనప్పటికీ, పార్టీ కంచుకోటలైన రాంపూర్ మరియు అజంగఢ్‌లలో లోక్‌సభ ఉపఎన్నిక పరాజయం తర్వాత సమాజ్ వాదీ పార్టీని పునరుద్ధరించే ప్రయత్నంగా ఈ చర్య కనిపిస్తుంది.

‘పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షురాలు, జిల్లా అధ్యక్షుడితో సహా జాతీయ, రాష్ట్ర, జిల్లా కార్యవర్గం మినహా పార్టీలోని అన్ని యువజన సంఘాలు, మహిళా సభ తో పాటు ఇతర అన్ని సెల్‌లు రద్దు అయ్యాయి. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆదేశాలతో తక్షణమే ఇది అమల్లోకి వస్తుంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవలి ఉపఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ ఎస్పీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. పార్టీ 2024 లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు సన్నద్ధం చేస్తున్నామని ఎస్పీ నేతలు చెబుతూ ఉన్నారు.

Related Articles

Back to top button