More

  హిందూ దేవుళ్లపై అసభ్య వ్యాఖ్యలు.. అజ్మీర్ దర్గా చిస్తీల చిల్లరచేతలు..!

  హిందూ దేవుళ్లపై ఇటీవల వివాదాలు ఎక్కువైపోయాయి. సిగిరెట్ కాలుస్తున్న కాళీ.. శివుడు దేశవ్యాప్తంగా వివాదాన్ని రేపాయి. ఈ క్రమంలో హిందూ దేవతలను అపహాస్యం చేస్తూ.. అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా అంజుమన్ కమిటీ కార్యదర్శి సయ్యద్ సర్వర్ చిస్తీ కుమారుడు అదిల్ చిస్తీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  హిందువులకు 33 కోట్ల మంది దేవుళ్లు ఎలా ఉంటారు? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసిన అదిల్.. పైగా వారిలో కొంతమంది దేవతలు సగం జంతువు..సగం మనుషుల్లా ఉంటారన్నారు. అది అసలు సాధ్యమేనా? అంటూ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వివాదం రేపాడు. అంతేకాదు.. సగం మనిషి, సగం జంతువులా ఉండే వినాయకుడు, హనుమంతుడు కూడా దేవుళ్లేనా? అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తీవ్ర వివాదంగా మారింది. అదిల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. తన వ్యాఖ్యలపై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో అదిల్ స్పందించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని అన్నారు. నుపుర్ శర్మను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశానంటూ మరో వీడియోను విడుదల చేశాడు. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలు అయినా గాయపడి ఉంటే తనను క్షమించాలని కోరారు.

  అయితే అదిల్ తన తర్వాత వీడియోలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నూపుర్ శర్మ హిందువు అయితే.. ఆమె కోసం నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అంటూ అదిల్ చెప్పుకొచ్చాడు.. 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారని ఎలా అంగీకరించాలి..? ఇది ఎలా సమంజసం..? మన మతాలు ఎలా ఉన్నా మనుషులుగా మనమంతా సమానమేనంటూ నీతి వ్యాఖ్యలు సైతం చెప్పాడు. తాము భగవంతుని ఉనికిని.. అత్యున్నతమైన దేవత ఉనికిని గట్టిగా నమ్ముతామని చెప్పుతూనే… వివిధ మతాల ప్రజలు ఒకే విషయంలో భిన్నమైన వివరణలు కలిగి ఉండవచ్చన్నాడు. ఇక హిందూ పురాణాలలో కూడా విష్ణువుకు 10 అవతారాల ప్రస్తావన ఉందని.. తాను అలాగే నూపుర్ శర్మకు గుర్తు చేయాలనుకుంటున్నాని చెప్పాడు. దేవుడు ఒక్కడే అని తమరు వాదిస్తారన్న అదిల్.. కానీ ఎదుటివారి దైవాలను మాత్రం విమర్శిస్తారు? ఇవి ఎంతవరకు సమంజసం? అంటూ ఆదిల్ చిస్తీ కవర్ చేసే ప్రయత్నం చేశాడు.

  అజ్మీర్ దర్గాకు చెందిన చిస్తీలు ఇటీవల తరచూ ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. ఆదిల్ చిస్తీ తండ్రి సర్వర్ చిస్తీ.. భారతదేశంలో హింసాత్మక ఉద్యమం జరుగుతుందని.. ఇది మొత్తం హిందుస్థాన్ దేశాన్ని కదిలిస్తుందని గతంలో వ్యాఖ్యానించారు. హిందువుల ఆధ్వర్యంలోని వ్యాపారాలను బహిష్కరించాలని కూడా సర్వర్ చిస్తీ పిలుపునిచ్చారు. అలాగే ప్రవక్త ముహమ్మద్‌ను అవమానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తల నరికివేయాలని సర్వర్ చిస్తీ మేనల్లుడు గౌహర్ చిస్తీ డిమాండ్ చేశాడు. ఇక కన్హయ్య లాల్ హంతకులను గౌహర్ చిస్తీ కలుసుకున్నారు. నూపూర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్‌ను షేర్ చేసినందుకు, ఉదయపూర్‌లో కన్హయ్య లాల్ హత్యకు గురి అయ్యాడు.

  అసలు హిందూ శాస్త్రం ప్రకారం ముక్కోటి దేవతలు.. 33 కోట్ల దేవతలు అని చెబుతూ ఉంటారు. అసలు వేదంలో చెప్పింది మాత్రం 33 మంది దేవతలే.. అస్టౌవ్ వశవహ.. ద్వాదశ దిత్యాః.. ఏకాదశ రుద్రాహ.. దో అశ్విని నౌచాహ.. అని వేదం చెప్పింది. అస్టౌవ్ వశవహ అంటే ఎనిమిదిమంది వసువులని అర్ధం. ద్వాదశ దిత్యా: అంటే 12 మంది ఆదిత్యులు అని.. ఇక ఏకాదశ రుద్రాహ అంటే 11 మంది రుద్రులు అని అర్ధం. అలాగే దో అశ్విని నౌచాహ అంటే ఇద్దరూ అశ్వినీ దేవతలతో మొత్తం 33 మంది దేవతలు. ఇక సంస్కృతంలో కోటి అనగా.. వర్గము, విధము అని అర్థం. ఇది సంఖ్యను సూచించే కోటి కాదు. ఈ 33 మంది దేవతలు ఒక్క గోమాత లోనే ఇమిడి ఉంటారు. గోమాతను హిందువులు అత్యంత పవిత్రంగా పూజిస్తూ ఉంటారు. అందుకే ఇటీవల కేంద్రం కూడా గోమాతను జాతీయ జంతువుగా భావించాలని యోచిస్తోంది.

  Trending Stories

  Related Stories