ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి ఐఏఎఫ్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసిన తర్వాత వివేక్ రామ్ చౌదరి కొత్త ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా నియమితులయ్యారు. గురువారం నాడు భదౌరియా 42 సంవత్సరాల సర్వీస్ ను పూర్తీ చేసిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి పదవీ విరమణ చేసారు. భదౌరియా 42 ఏళ్ల సర్వీసులో 36 రాఫెళ్లు, 83 మార్క్ 1ఏ తేజస్ విమానాల కొనుగోళ్ల విషయంలో కీలక పాత్ర పోషించారు. ఎయిర్ చీఫ్ మార్షల్‌గా ఉన్న ఆర్కేఎస్ భదౌరియా పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో హైదరాబాద్‌కు చెందిన వివేక్ రామ్ చౌదరిని నియమిచింది కేంద్ర ప్రభుత్వం. 2024 వరకు మూడేళ్ల పాటు ఎయిర్‌ఫోర్స్ చీఫ్ పదవిలో వివేక్‌రామ్ చౌదరి కొనసాగుతారు. సీనియారిటీ ప్రాతిపదికన ప్రభుత్వం చౌదరిని ఈ పదవికి ఎంపిక చేసింది.
చైనాతో ఉద్రిక్తత నెలకొన్న సమయంలో లడాఖ్ వద్ద ఇంచార్జీగా వ్యవహరించారు. వైమానికదళం హెడ్‌క్వార్టర్స్‌లో కూడా ఆయన విధులు నిర్వర్తించారు. వైమానిక రక్షణ వ్యవస్థల ఆధునీకరణలో చౌదరి ముఖ్య పాత్ర పోషించనున్నారు. త్వరలో ఇండియా ఎస్-400 డిఫెన్స్ సిస్టమ్‌లను రష్యా నుంచి తీసుకురానున్నది. యుద్ధ విమానాల ఆధునీకరణలోనూ చౌదరి బాధ్యత తీసుకోనున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి కుమారుడు కూడా యుద్ధ విమాన పైలెట్. ఆయన రాఫెల్ యుద్ధ విమానాన్ని నడుపుతాడు. 1982లో చౌదరీ ఐఏఎఫ్‌లో చేరారు. 3800 గంటల పాటు ఫ్లయింగ్ అనుభవం ఉన్నది. ఫైటర్, శిక్షణ విమానాలను నడిపారు. ఆపరేషన్ మేఘదూత్‌లో పాల్గొన్నారు. 1980 దశకంలో సియాచిన్ గ్లేసియర్‌ను ఆక్రమించే సమయంలో ఆపరేషన్ మేఘదూత్ చేపట్టారు. కార్గిల్ యుద్ధ సమయంలో ఆపరేషన్ సఫేద్ సాగర్‌లోనూ పాల్గొన్నారు. దాదాపు 39 సంవత్సరాల కెరీర్‌లో భారత వైమానిక దళానికి చెందిన వివిధ రకాల ఫైటర్, ట్రైనర్ విమానాలను నడిపారు. మిగ్ -21, మిగ్ -23 ఎంఎఫ్, మిగ్ -29, సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ వంటి ఎయిర్‌క్రాఫ్ట్‌లలో సుమారు 3,800 గంటల పాటు ప్రయాణించిన అనుభవం ఆయనకు ఉంది.